- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తమిళనాడులో కూటమి సమీకరణాలు.. కాంగ్రెస్‌కు రాజ్యసభ సీటు కేటాయించిన టీవీకే
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త సమీకరణాలు మొదలయ్యాయి.

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు పాలిటిక్స్‌లో రాజ్యసభ ఎన్నికల సందడి మొదలైంది. సీఎం విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ, తమ కూటమిలో భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి రాజ్యసభ సీటును కేటాయిస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు పార్టీ అధినేత విజయ్ సంతకంతో కూడిన ఓ అధికారిక ప్రకటనను ఇవాళ సాయంత్రం విడుదల చేశారు. అయితే, ఈ నెల 18న తమిళనాడు నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ (Rajya Sabha) స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో తమిళగ వెట్రి కళగం నాయకత్వంలోని కూటమి తరఫున పోటీ చేసేందుకు మిత్రపక్షమైన కాంగ్రెస్ పార్టీకి ఓ స్థానాన్ని (Rajya Sabha Seat) కేటాయించాలని నిర్ణయించారు. తమిళనాడులో రాబోయే ఎన్నికల వ్యూహాల్లో భాగంగా విజయ్ నేతృత్వంలోని టీవీకే, కాంగ్రెస్ పార్టీల మధ్య కుదిరిన ఈ సీట్ల సర్దుబాటు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.






