- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరణానికి కొన్నిగంటల ముందు.. అజిత్ పవార్ ఆఖరి "ఎక్స్" పోస్ట్ ఇదే
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదంలో దుర్మరణం చెందడం దేశ రాజకీయాల్లో పెను విషాదాన్ని నింపింది.

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ విమాన ప్రమాదంలో దుర్మరణం చెందడం దేశ రాజకీయాల్లో పెను విషాదాన్ని నింపింది. ప్రధాని నరేంద్ర మోదీ సహా కేంద్రమంత్రులు, రాష్ట్రాల సీఎంలు, ఇతర జాతీయ, రాష్ట్రీయ నేతలంతా ఆయన మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అజిత్ పవార్ మరణానికి కొన్ని గంటల ముందు ఆయన ఎక్స్ లో చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. నిన్న (మంగళవారం) రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వివరిస్తూ ఆయన చేసిన పోస్ట్.. ప్రజలకు చివరి సందేశంగా మిగిలింది.
ప్రభుత్వ భూముల లీజు పొడిగింపు, వృత్తి విద్యా శిక్షణా సంస్థల ఏర్పాటు, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ కాంట్రాక్టర్ల చెల్లింపుల వ్యవస్థలో మార్పులు వంటి అంశాలను పోస్ట్ లో ప్రస్తావించారు. ఇది కేవలం సమాచారంగా కనిపించినా.. దీనివెనుక ఇటీవలి రాజకీయ పరిణామాలు ముడిపడి ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని మహాయుతి కూటమిలో నెలకొన్న అంతర్గత విభేదాల తర్వాత.. ఇప్పుడు అంతా సవ్యంగా ఉందని చెప్పేందుకు ఈ పోస్ట్ చేసినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
READ MORE ....
డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి వెనుక కుట్ర ఉందా.. ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు






