డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి వెనుక కుట్ర ఉందా.. ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

by Malleboina Mahesh |   (  Updated:2026-01-28 08:10:24  IST  )

బారామతిలో ఈ రోజు ఉదయం జరిగిన విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణించడంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు.

డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి వెనుక కుట్ర ఉందా.. ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: బారామతిలో ఈ రోజు ఉదయం జరిగిన విమాన ప్రమాదంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరణించడంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Rajasingh) స్పందించారు. ఈ ప్రమాదంపై సోషల్ మీడియాలో వస్తున్న కథనాలను ప్రస్తావిస్తూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అజిత్ పవార్ మృతి వెనుక ఏదైనా కుట్ర దాగి ఉందా? లేక కేవలం సాంకేతిక లోపం వల్లనే ఈ ప్రమాదం జరిగిందా? అనే కోణంలో నిజానిజాలు బయటకు రావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ ఘటనపై రాజాసింగ్ మాట్లాడుతూ.. "విమాన ప్రమాదం జరిగిన తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో కుట్ర జరిగిందనే వార్తలు విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. అయితే, విమానానికి సంబంధించిన 'బ్లాక్ బాక్స్' లభ్యమైతేనే అసలు ఏం జరిగిందనేది స్పష్టంగా తెలుస్తుంది. సాంకేతిక సమస్య తలెత్తిందా లేక మరేదైనా కారణమా అనేది బ్లాక్ బాక్స్ డేటా ఆధారంగా బయట పడుతుంది" అని వెల్లడించారు. అలాగే మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక నేత అయిన అజిత్ పవార్ ఆకస్మిక మరణం తనను షాక్‌కు గురిచేసిందని. ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేసేందుకు ప్రభుత్వం ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని ఎమ్మెల్యే రాజాసింగ్ కోరారు. చివరగా అజిత్ పవార్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

READ MORE ....

మరణానికి కొన్నిగంటల ముందు.. అజిత్ పవార్ ఆఖరి "ఎక్స్" పోస్ట్ ఇదే

Next Story