Ajit Pawar: అజిత్ పవార్ మృతి.. ప్రమాదమా? కుట్రకోణమా?

by Prasad Jukanti |   (  Updated:2026-01-28 07:07:42  IST  )

విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం దేశ రాజకీయాల్లో తీవ్ర విషాదం నింపింది. ఈ విమాన ప్రమాదం వెనుక ఏం జరిగిందనే చర్చ ఇప్పుడు ఉత్కంఠగా మారింది.

Ajit Pawar: అజిత్ పవార్ మృతి.. ప్రమాదమా? కుట్రకోణమా?
X

దిశ, డైనమిక్ బ్యూరో: మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బుధవారం ఉదయం జరిగిన విమాన ప్రమాదంలో ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి (Maharashtra Deputy CM), ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ (66) తో సహా మొత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో జిత్‌ పవార్‌తో (Ajit Pawar) పాటు ముంబయి పీఎస్‌వో వదీప్‌ జాదవ్‌, కెప్టెన్‌ సుమిత్ కపూర్‌, కెప్టెన్‌ శాంభవి పాఠక్‌, ఫ్లైట్‌ అటెండెంట్‌ పింకీ మాలి మరణించినట్లు తెలిసింది. అజిత్‌ పవార్‌తో పాటు ముంబయి పీఎస్‌వో వదీప్‌ జాదవ్‌, కెప్టెన్‌ సుమిత్ కపూర్‌, కెప్టెన్‌ శాంభవి పాఠక్‌, ఫ్లైట్‌ అటెండెంట్‌ పింకీ మాలి మరణించినట్లు తెలిస్తోంది. వచ్చే నెలలో జరగబోతున్న జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారం నిమిత్తం ఇవాళ బరామతిలో నిర్వహించబోయే బహిరంగ సభకు హాజరయ్యేందుకు అజిత్ పవార్ ఇవాళ ఉదయం ముంబయి నుంచి ప్రైవేట్ చార్టర్డ్ విమానంలో బయలుదేరారు.8:45 గంటలకు మరికాసేపట్లో గమ్యస్థానానికి చేరుకుంటుంది అనగా విమానంలో తీవ్ర సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు తెలుస్తోంది. బారామతి విమానాశ్రయంలో ల్యాండ్ చేయాలని పైలట్ ప్రయత్నించినా చివరకు రన్ వేకు వంద అడగులకు ముందే క్రాష్ ల్యాండ్ అయింది. నేరుగా బండరాయిని ఢీ కొనడంతో ఫ్లైట్ రెండు ముక్కలుగా విరిగిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే భారీగా మంటలు ఎగిసిపడటంతో విమానం తోకభాగం మినహా అంతా మంటల్లో కాలిబూడిదయింది. ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్‌సైట్ Flightradar24 ప్రకారం, విమానం బారామతి విమానాశ్రయానికి రెండవసారి చేరుకోవడానికి ప్రయత్నిస్తుండగా కూలిపోయిందని తెలిపింది.

అనూహ్య పరిణామాలు:

మహారాష్ట్ర రాజకీయాల్లో పవర్ సెంటర్ గా ఉన్న అజిత్ పవార్ విమాన ప్రమాదంలో దుర్మరణం చెందడం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. సాంకేతిక కారణాలతో ఈ ప్రమాదం సంభవించినట్లు ప్రాథమికంగా అధికారులు అంచనా వేస్తున్నా ఈ ఘనటపై పలు అనుమానాలు సైతం తెరపైకి వస్తున్నాయి. నిజంగానే సాంకేతిక లోపం వల్లే ఈ ప్రమాదం సంభవించిందా? లేక పైలట్ తప్పిదం వల్లనా లేదా అజిత్ పవార్ మరణం వెనుక ఏదైనా కుట్ర కోణం ఉందా అనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. మహారాష్ట్ర రాజకీయాల్లో ఇటీవల చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే కుట్రకోణాన్ని కొట్టిపారేయలేమని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

నాలుగు రోజుల క్రితం ఆ ప్రకటన ఇంతలోనే విషాదం:

తన బాబాయ్ శరద్ పవార్‍ను ధిక్కరించి అజిత్ పవార్ 2019లో బీజేపీతో చేతులు కలిపారు. అయితే ఈ ప్రయత్నం బెడిసికొట్టడంతో ఆ వెంటనే తిరిగి వెనక్కి వచ్చేశారు. అనంతరం 2022లో ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ కూటమి ప్రభుత్వం కూలిపోగానే మరోసారి శరత్ పవార్‍పై తిరుగుబాటు చేశారు. ఎన్సీపీని రెండు ముక్కలుగా చేల్చి తన వర్గంతో మళ్లీ బీజేపీతో చేతులు కలిపి డిప్యూటీ సీఎంగా పని చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎన్డీయే కూటమితోనే కొనసాగి విజయం సాధించి మరోసారి మహారాష్ట్రకు డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నాయి. ఇయితే ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన ఫలితాల్లో అజిత్ పవార్ పార్టీ పర్వాలేదు అనిపించినా కొన్ని చోట్ల జరిగిన పరిణామాలు కొత్త చర్చకు దారి తీసింది. తమకు పట్టు ఉన్న పూణెలోగెలుపు కోసం పవార్ కుటుంబాలు మళ్లీ కలిశాయి. దీంతో శరత్ పవార్, అజిత్ పవార్ మళ్లీ కలవబోతున్నారు అనే చర్చ అప్పటి నుంచి జోరుగా వినిపిస్తోంది. ఎన్సీపీలో ఏర్పడిన చీలికను ఏకం చేయడానికి అజిత్ పవార్ మళ్లీ తిరిగి మహా వికాస్ అఘాడీ కూటమిలోకి త్వరలోనే వస్తారని శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ నాలుగు రోజుల క్రితమే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంతలోనే ఈ దుర్ఘటన చోటు చేసుకోవడం సంచలనంగా మారింది.

భారీ పేలుళ్లు:

విమాన ప్రమాదంపై ప్రత్యక్ష సాక్షులు తెలిపిన కథనం ప్రకారం విమానం కిందకు దిగుతుంటే అది ప్రమాదానికి గురవుతుందనిపించినట్లు ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపినట్లు జాతీయ మీడియా పేర్కొంది. విమానం నేలను తాకిన తర్వాత పలు మార్లు పేలుడు శబ్ధాలు వినిపించాయని ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు వచ్చినా భారీ అగ్ని కీలల కారణంగా ఎవరినీ కాపాడలేకపోయినట్లు చెప్పారు.

ప్రమాదానికి గురైన విమానం గురించి:

అజిత్ పవార్ ప్రాణాలు బలిగొన్న చార్టెర్డ్ ఫ్లైట్ భారతదేశంలోనే అతి పెద్ద నాన్-షెడ్యూల్డ్ ఎయిర్ క్రాఫ్ట్ ఆపరేటర్లలో ఒకటైన వీఎస్ఆర్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యంలోని లియర్ జెట్ 45XR. లియర్ జెట్ 45 మోడల్ ఫ్లైట్లను బాంబార్డియర్ ఏరో స్పేస్ (1998-2009) తయారు చేశారు. ఇది 2000-2235 నాటికల్ మైళ్ల పరిధిని కలిగి ఉంది. ఇందులో ఎనిమిది మంది వరుక ప్రయాణించేందుకు వీలుంటుంది. రెండు హనీవెల్ TFE731 ఇంజిన్లతో నడిచే ఈ ఫ్లైట్ ఇది 51,000 అడుగుల వరకు ఎగురుతుంది మరియు దాని వేగం మరియు సమర్థవంతమైన, సౌకర్యవంతమైన క్యాబిన్‌కు గుర్తింపు పొందింది. ఈ బిజినెస్ జెట్ స్వల్ప నుండి మధ్యస్థ దూర విమానాల కోసం రూపొందించబడింది. ఈ విమానం 47 అడుగుల రెక్కల విస్తీర్ణం, 9,752 కిలోల బరువు కలిగి ఉంటుంది.

READ MORE .....

బారామతి విమాన ప్రమాదంపై సంచలన విషయాలు వెల్లడించిన ప్రత్యక్ష సాక్షి

Next Story