బారామతి విమాన ప్రమాదంపై సంచలన విషయాలు వెల్లడించిన ప్రత్యక్ష సాక్షి

by Malleboina Mahesh |   (  Updated:2026-01-28 07:18:46  IST  )

మహారాష్ట్రలోని బారామతి లో జరిగిన విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం చెందిన విషయం తెలిసిందే.

బారామతి విమాన ప్రమాదంపై సంచలన విషయాలు వెల్లడించిన ప్రత్యక్ష సాక్షి
X

దిశ, వెబ్ డెస్క్: మహారాష్ట్రలోని బారామతి లో జరిగిన విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. ఈ విమాన ప్రమాద ఘటనకు సంబంధించిన కీలక విషయాలు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో ఒక ప్రత్యక్ష సాక్షి వెల్లడించిన వివరాలు అత్యంత దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి. విమానం ల్యాండ్ అయ్యే సమయంలోనే అదుపు తప్పిందని, చూస్తుండగానే భారీ శబ్దంతో కుప్పకూలిందని ఆయన మీడియాకు వివరించారు.

ప్రత్యక్ష సాక్షి మీడియాతో మాట్లాడుతూ.. "విమానం ల్యాండ్ అవుతున్న తీరు చూస్తేనే అది కూలిపోతుందేమో అన్న భయం కలిగింది. అనుకున్నట్లుగానే ఒక్కసారిగా రన్‌వే సమీపంలో కూలిపోయి భారీ పేలుడు సంభవించింది. మేమంతా వెంటనే అక్కడికి పరుగెత్తాం. లోపల ఉన్నవారిని కాపాడాలని ప్రయత్నించాం కానీ, వరుసగా 4-5 సార్లు పేలుళ్లు సంభవించడంతో మంటల తీవ్రతకు దగ్గరికి వెళ్లలేకపోయాం" అని సాక్షి కన్నీటి పర్యంతమయ్యారు.

డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సహా ఐదుగురి మృతి

ఈ ఘోర విమాన ప్రమాదంలో అజిత్ పవార్‌తో పాటు మొత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో అజిత్ పవార్ వ్యక్తిగత భద్రతా అధికారి (PSO), ఒక అటెండెంట్, ఇద్దరు పైలట్లు ఉన్నట్లు అధికారికంగా ధృవీకరించారు. ముంబై నుంచి జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు బారామతి వస్తుండగా బుధవారం ఉదయం సుమారు 8:45 గంటల సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. ల్యాండింగ్ సమయంలో సంభవించిన సాంకేతిక లోపమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రమాద స్థలాన్ని అధికారులు తమ ఆధీనంలోకి తీసుకుని దర్యాప్తును వేగవంతం చేశారు.

READ MORE .....

Ajit Pawar: అజిత్ పవార్ మృతి.. ప్రమాదమా? కుట్రకోణమా?

Next Story