- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విమాన ప్రమాదం..మృతుల సంఖ్యపై ఎయిర్ ఇండియా ప్రకటన
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో 241 మంది మరణించినట్టు ఎయిర్ ఇండియా అధికారిక ప్రకటన చేసింది. విమానం టేకాఫ్

దిశ, వెబ్ డెస్క్: అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో 241 మంది మరణించినట్టు ఎయిర్ ఇండియా అధికారిక ప్రకటన చేసింది. విమానం టేకాఫ్ అయిన సమయంలో అందులో 242 మంది ఉన్నారని తెలిపింది. అంతే కాకుండా ప్రాణాలతో బయటపడ్డ ఒకే ఒక్క వ్యక్తి భారత సంతతికి చెందిన బ్రిటిష్ పౌరుడిగా ప్రకటించింది. ప్రస్తుతం అతడికి చికిత్స అందిస్తున్నట్టు తెలిపింది. అంతే కాకుండా ప్రమాదానికి గురైన విమానంలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటీష్ దేశస్తులు, ఏడుగురు పోర్చుగీసు వాళ్లు, ఒక కెనాడా వ్యక్తితో పాటూ 12 మంది విమానంలో పనిచేసే సిబ్బంది ఉన్నారని తెలిపింది.
మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్టు ప్రకటించింది. ఇదిలా ఉంటే ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్యల కారణంగా ప్రమాదం జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి. ఎయిర్ ఇండియా బోయింగ్ విమానాలపై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రమాదానికి ముందు ఓ ప్రయాణికుడు తీసిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో విమానంలో ఏసీతో పాటూ ఏవీ సరిగ్గా పనిచేయడంలేదని ప్రయాణికుడు ఆరోపించారు.
Read More..






