- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాజీ సీఎం విజయ్ రూపానీకి దురదృష్టంగా మారిన లక్కీ నంబర్
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో కొంతమంది ప్రముఖులు కూడా కన్నుమూసిన సంగతి తెలిసిందే. క్రాష్ అయిన విమానంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఉన్నారు.

దిశ, వెబ్ డెస్క్: అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో కొంతమంది ప్రముఖులు కూడా కన్నుమూసిన సంగతి తెలిసిందే. క్రాష్ అయిన విమానంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఉన్నారు. అయితే ఆయన గురించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. విజయ్ రూపానీ అదృష్ట సంఖ్య 1206. విజయ్ రూపానికి సంబంధించిన అన్ని వాహనాల నంబర్ కూడా 12/06 అని ఉంటుంది.
ఈ నంబర్ విజయ్ రూపానీకి ఎంతో కలిసి రావడంతో తన లక్కీ నంబర్ అనుకున్నారు. కానీ చివరికి లక్కీ నంబర్ ఏ ఆయన ప్రాణాలు తీసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. దానికి కారణం ఆయన మరణించిన విమానం నంబర్ కూడా 1206 కావడమే. దీంతో మాజీ సీఎం అదృష్ఠ సంఖ్యనే దురదృష్టంగా మారిందా అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉంటే ఈ విమాన ప్రమాదంలో 241 మంది ప్రాణాలు కోల్పోగా ఒక్కరు మాత్రమే బయటపడ్డారు. ఆయనను మృత్యుంజయుడు అని అంటున్నారు. అసలు అదృష్టవంతుడు అతడే అని చెబుతున్నారు.






