ఆభరణాల వివాదంతో భార్యను కాల్చి చంపి.. అనంతరం..

by Anjali |
ఆభరణాల వివాదంతో భార్యను కాల్చి చంపి.. అనంతరం..
X

దిశ, వెబ్‌డెస్క్: నగల విషయంలో గొడవపడి ఓ వ్యక్తి భార్యను కాల్చి చంపిన ఘోరమైన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌ షికోహాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. దీపక్ యాదవ్ అనే 30 ఏళ్ల వ్యక్తి అతడి భార్య శశి(26) తరచూ నగల గురించి గొడవపడుతూ ఉండేవారు. ఆదివారం (జూన్ 25)రోజున దంపతులిద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో కుటుంబీకులు జోక్యం చేసుకున్నారు. ఇకపై తన భార్యతో గొడవపడనని దీపక్ తన సోదరుడికి మాట ఇచ్చాడు. సోమవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో దీపక్ గది నుంచి కాల్పుల శబ్దం వినిపించింది. దీంతో ఏమైందని కుటుంబసభ్యులు వెళ్లి చూడగా.. శశి మృతదేహం మంచంపై కనిపించింది. దీపక్ శవం వేరే గదిలో తుపాకీతో కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. మృతదేహాలను పోస్టుమార్టం తరలించారు. దీపక్ ఆర్మీలో ఉద్యోగానికి సిద్ధమవుతున్న టైమ్‌లో ఇలా జరిగిందంటూ కుటుంబీకులు బోరున విలపిస్తున్నారు.

Next Story

Most Viewed