‘ప్రజలు బాగా బుద్ధి చెప్పారు’: ఎన్నికల ఫలితాలపై నటి కస్తూరి షాకింగ్ కామెంట్స్

by Gantepaka Srikanth |   (  Updated:2026-05-04 13:17:47  IST  )

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ నటి కస్తూరి సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

‘ప్రజలు బాగా బుద్ధి చెప్పారు’: ఎన్నికల ఫలితాలపై నటి కస్తూరి షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ నటి కస్తూరి సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. అధికార డీఎంకే (DMK) ప్రచారం చేసిన 'ద్రవిడ మోడల్' పాలనను తమిళ ప్రజలు పూర్తిగా తిరస్కరించారని ఆమె విమర్శించారు. "ప్రజలు విసిగిపోయారు.. మార్పును కోరుకున్నారు. అందుకే 'ద్రవిడ మోడల్' అని పిలవబడే పాలనను రాష్ట్రం నుండి తరిమికొట్టారు" అని ఆమె పేర్కొన్నారు. దశాబ్దాలుగా సాగుతున్న పాత రాజకీయాలకు కాలం చెల్లిందని ఈ ఫలితాలు నిరూపిస్తున్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. ఇది కేవలం ఓటు వేయడం కాదు, ఒక వ్యవస్థపై ప్రజలు చూపిన వ్యతిరేకత అని కస్తూరి వ్యాఖ్యానించారు. డీఎంకే పట్ల ప్రజల్లో ఉన్న అసహనం ఫలితాల్లో స్పష్టంగా కనిపిస్తోందని, ముఖ్యంగా యువత కొత్త శక్తులకు పట్టం కట్టారని ఆమె అన్నారు. నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) పార్టీ సాధిస్తున్న ఆధిక్యాన్ని ప్రస్తావిస్తూ, తమిళనాడులో ప్రత్యామ్నాయ రాజకీయాలకు ఆదరణ పెరిగిందని పేర్కొన్నారు.

దుమారం రేపుతున్న వ్యాఖ్యలు..

ఎప్పుడూ సామాజిక, రాజకీయ అంశాలపై ముక్కుసూటిగా స్పందించే కస్తూరి, ఇప్పుడు ఏకంగా అధికార పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకమైన 'ద్రవిడ మోడల్' నినాదాన్నే లక్ష్యంగా చేసుకోవడం చర్చనీయాంశమైంది. అటు సోషల్ మీడియాలో డీఎంకే మద్దతుదారులు ఆమెపై విమర్శలు గుప్పిస్తుండగా, మార్పును కోరుకునే వారు ఆమె వ్యాఖ్యలకు మద్దతు తెలుపుతున్నారు. ప్రస్తుత కౌంటింగ్‌లో డీఎంకే కూటమి గట్టి పోటీని ఎదుర్కొంటుండగా, విజయ్ పార్టీ 100కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండటం గమనార్హం.

బెంగాల్ గడ్డపై వికసించిన కమలం: ప్రధాని మోడీ తొలి స్పందన

Next Story