బెంగాల్ గడ్డపై వికసించిన కమలం: ప్రధాని మోడీ తొలి స్పందన

by Gantepaka Srikanth |   (  Updated:2026-05-04 13:05:23  IST  )

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (BJP) సాధించిన అఖండ విజయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు.

బెంగాల్ గడ్డపై వికసించిన కమలం: ప్రధాని మోడీ తొలి స్పందన
X

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (BJP) సాధించిన అఖండ విజయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. కౌంటింగ్ ట్రెండ్స్‌లో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ దాటి 200 స్థానాల దిశగా దూసుకుపోతుండటంతో, బెంగాల్ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. బెంగాల్ గడ్డపై "కమలం వికసించింది" (Lotus blooms in West Bengal) అంటూ ఆనందం వ్యక్తం చేశారు. దశాబ్దాల తరబడి బెంగాల్‌ను పాలించిన శక్తులకు స్వస్తి పలికి, ప్రజలు అభివృద్ధికి (సోనార్ బంగ్లా) పట్టం కట్టారని ప్రధాని పేర్కొన్నారు. ప్రాణాలకు తెగించి బెంగాల్‌లో పార్టీ కోసం పోరాడిన ప్రతి బీజేపీ కార్యకర్తకు ఈ విజయం అంకితమని ఆయన కొనియాడారు. "మా మాతీ మానుష్" పేరుతో జరిగిన అన్యాయాలకు అంతం పలికి, బెంగాల్‌ను మళ్లీ దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ప్రధాని హామీ ఇచ్చారు.

మే 4వ తేదీ - సరికొత్త రికార్డు..

బెంగాల్ చరిత్రలో బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. తృణమూల్ కాంగ్రెస్ 15 ఏళ్ల సుదీర్ఘ పాలనకు ఈ ఫలితాలతో తెరపడింది. ప్రధాని మోడీ తన ప్రసంగాల్లో తరచుగా చెప్పే "ఆశల్ పరిబోర్తన్" (నిజమైన మార్పు) బెంగాల్ ప్రజలు నెరవేర్చారని జాతీయ నాయకత్వం సంబరాలు జరుపుకుంటోంది. త్వరలోనే ప్రధాని మోడీ బెంగాల్‌లో పర్యటించి, కొత్త ప్రభుత్వం ఏర్పాటు, ప్రమాణ స్వీకార కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది.

టీఎంసీ ఘోర ఓటమి పై హీరో నిఖిల్ సంచలన పోస్ట్!

Next Story