- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొనసాగుతోన్న అల్పపీడనం.. నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
ఏపీలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA ఎండీ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు.

X
దిశ, వెబ్ డెస్క్: వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరాలపై బాగా గుర్తించబడిన అల్పపీడనంగా కొనసాగుతోందని APSDMA తెలిపింది. దీని ప్రభావంతో మేఘవృతమైన వాతావరణంతో పాటు, కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈ తరుణంలోనే ఆదివారం మేఘవృతమైన వాతావరణంతో పాటు ఒకటి-రెండుచోట్ల భారీ వర్షాలు ఉన్నట్లు పేర్కొన్నారు APSDMA ఎండీ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. అల్లూరి, పోలవరం జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. గంటకు 40-50 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈదురుగాలులు, ఉరుములతో వర్షం పడే సమయంలో ప్రజలు చెట్ల కింద, భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడొద్దని సూచనలు చేశారు.
Next Story






