- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వరుసగా మూడు ఓటములు...తీవ్ర ఒత్తిడిలో శ్రేయస్ అయ్యర్
వరుసగా మూడు ఓటములు ఎదురైన నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్ తీవ్ర ఒత్తిడిలోకి వెళ్లారు.

దిశ, వెబ్ డెస్క్: భారత టీ20 కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తీవ్ర ఒత్తిడిలోకి వెళ్ళినట్లు తెలుస్తోంది. వరుసగా అతని కెప్టెన్సీలో మూడు మ్యాచ్ లను కోల్పోయింది భారత్. ఐర్లాండ్ చేతిలో వరుసగా రెండు మ్యాచ్ లు ఓడిన శ్రేయస్ అయ్యర్ సేన, వైట్ వాష్ అయింది. ఇక ఇప్పుడు ఇంగ్లాండ్ తో జరుగుతున్న టీ20 సిరీస్ సందర్భంగా ఆదిలోనే మ్యాచ్ ఓడిపోయింది భారత్. అంటే శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ మొత్తం నాలుగు మ్యాచ్ లు ఆడింది.
ఇందులో ఒకటి వర్షం కారణంగా రద్దు కాగా... మూడింటిలో ఓడిపోయింది. ఈ క్రమంలో కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నట్లు క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఇలాంటి సమయంలోనే నిలదొక్కుకొని నిలబడ్డవాడు.. అసలు సిసలు కెప్టెన్ అంటూ అతడికి పలు సూచనలు కూడా ఇస్తున్నారు. ఓటమికి శ్రేయస్ అయ్యర్ తలవంచబోడని స్పష్టం చేస్తున్నారు. తర్వాతి మ్యాచ్ లలో ఇండియా కచ్చితంగా గెలుస్తుందని అంచనా వేస్తున్నారు.






