సమంత మ‌రో కొత్త ప్ర‌యాణం

by velandi.Saikiran |

ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీలివ్ తమిళంతో చేతులు కలిపినట్లు అధికారికంగా వెల్లడించారు సమంత.

సమంత మ‌రో కొత్త ప్ర‌యాణం
X

దిశ‌, వెబ్ డెస్క్: రెండో పెళ్లి చేసుకున్న సమంత... కెరీర్ లో దూసుకు వెళ్తోంది. ఇటీవల మా ఇంటి బంగారం సినిమాతో బంపర్ హిట్ అందుకున్న హీరోయిన్ సమంత.. లేటెస్ట్ గా మరో కీలక ప్రకటన చేసింది. ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీలివ్ తమిళంతో చేతులు కలిపినట్లు అధికారికంగా వెల్లడించారు సమంత. మార్పును ఆహ్వానించి.. ప్రయాణాన్ని నమ్మాలని ఈ సంవత్సరం నాకు గుర్తు చేసింది అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

సోనీలివ్ తమిళంతో ఈ కొత్త అధ్యాయం మొదలు పెట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు. అద్భుతమైన ప్రాజెక్టు కోసం తాను పనిచేస్తున్నట్లు వివరించారు. వాటి వివరాలు త్వరలోనే పంచుకుంటానని వెల్లడించారు సమంత. దీంతో సమంత చేసిన ప్రకటన వైరల్ గా మారింది. కాగా హీరోయిన్ సమంత లేటెస్ట్ గా చేసిన సినిమా మా ఇంటి బంగారం. ఈ సినిమా జూన్ చివరి వారంలో రిలీజ్ కాగా.. ప్రపంచ వ్యాప్తంగా 85 కోట్లు వసూలు చేసింది. నందిని రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే.

Next Story