అక్షర్ పటేల్ సెంచ‌రీ..తొలి భారత స్పిన్నర్‌గా రికార్డ్

by velandi.Saikiran |

టీ20 ఫార్మాట్ లో 100 వికెట్లు తీసిన తొలి భారత స్పిన్నర్ గా అక్షర్ నిలిచాడు.

అక్షర్ పటేల్ సెంచ‌రీ..తొలి భారత స్పిన్నర్‌గా రికార్డ్
X

దిశ‌, వెబ్ డెస్క్: ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన రెండో టీ20 సందర్భంగా ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీ20 ఫార్మాట్ లో 100 వికెట్లు తీసిన తొలి భారత స్పిన్నర్ గా అక్షర్ నిలిచాడు. శనివారం ఇంగ్లాండ్ తో జరిగిన రెండో టీ20 సందర్భంగా కెప్టెన్ బ్రూక్ వికెట్ తీయడం ద్వారా ఈ రికార్డు సృష్టించాడు. భారత జట్టు తరఫున 113 వికెట్లతో అర్ష్ దీప్ సింగ్ మొదటి స్థానంలో ఉండగా... అతని తర్వాత బుమ్రా 121 వికెట్లతో రెండు స్థానంలో ఉన్నాడు. హార్దిక్ పాండ్యా 114 వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా 193 వికెట్లతో రషీద్ ఖాన్ తొలి స్థానంలో ఉండడం గమనార్హం.

ఇంగ్లాండ్ చేతిలో ఓడిన భారత్

శనివారం జరిగిన రెండో టీ20 సందర్భంగా ఇంగ్లాండ్ చేతిలో భారత్ దారుణంగా ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన శ్రేయస్ సేన 190 పరుగులు సాధించింది. ఇక ఈ లక్ష్యాన్ని ఒక ఓవర్ మిగిలి ఉండగానే ఇంగ్లాండ్ ఛేదించి, భారత జట్టుకు షాక్ ఇచ్చింది.

Next Story