#Chiyaan63 క్రిస్మస్ లేదా సంక్రాంతికి రిలీజ్

by Chukka Sudharani |

స్టార్ హీరో విక్రమ్ ప్రస్తుతం తన కెరీర్‌లో రాబోతున్న Chiyaan63 చిత్రంతో బిజీగా ఉన్నాడు.

#Chiyaan63  క్రిస్మస్ లేదా సంక్రాంతికి రిలీజ్
X

దిశ, సినిమా: స్టార్ హీరో విక్రమ్ ప్రస్తుతం తన కెరీర్‌లో రాబోతున్న 63వ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ‘Chiyaan63’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌కు ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. సత్యజ్యోతి ఫిలిమ్స్ పతాకంపై దీనిని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ ఒకటి వచ్చింది. ‘‘Chiyaan63’ షూటింగ్‌ను 80 రోజుల షెడ్యూల్‌లో పూర్తి చేయాలని ప్రణాళిక రూపొందించారు. ఈ చిత్రాన్ని 2026 క్రిస్మస్ లేదా 2027 సంక్రాంతికి విడుదల చేయాలని చిత్ర బృందం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో చియాన్ విక్రమ్‌ను ప్రేక్షకులు మునుపెన్నడూ చూడని సరికొత్త రూపంలో చూడబోతున్నారు’ అంటూ ఓ పోస్ట్ వైరల్ అవుతుండగా.. ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. కాగా.. ఇందులో రియా శిబు, ఊర్వశి, ఎం.ఎస్. భాస్కర్, సముద్రఖని తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

Next Story