- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ind vs Eng :ధారాళంగా పరుగులు ఇచ్చిన రవి బిష్ణోయ్.. రెండో టీ20లో భారత్ ఓటమి
ఇంగ్లాండ్‌తో రెండో టీ20లో టీమిండియా పరాజయం పాలైంది.

దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో భారత్ 4 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 190 స్కోరు చేసింది. ఇషాన్ కిషన్(49), అభిషేక్ శర్మ(43), శ్రేయస్ అయ్యర్(37), తిలక్ వర్మ(24 నాటౌట్) రాణించడంతో ఇంగ్లాండ్ ముందు భారత్ టఫ్ టార్గెటే పెట్టింది. కానీ, లక్ష్యాన్ని కాపాడుకోవడంలో విఫలమైంది. 191 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ మరో ఓవర్ మిగిలి ఉండగానే ఛేదించింది. జాకబ్ బెథెల్ 46 బంతుల్లో 76 పరుగులతో సత్తాచాటి ఇంగ్లాండ్‌ను గెలిపించాడు. హ్యారీ బ్రూక్(39), టామ్ బాంటన్(39) కూడా తమ పాత్ర పోషించారు. ఒక దశలో మ్యాచ్ భారత్ చేతుల్లోనే ఉంది. 24 బంతుల్లో 49 పరుగులు చేయాల్సిన స్థితిలో 17వ ఓవర్ వేసిన స్పిన్నర్ రవి బిష్ణోయ్ 29 రన్స్ ఇవ్వడంతో మ్యాచ్ టీమిండియా చేజారింది. రవి బిష్ణోయ్ ఒక్కడే 60 రన్స్ సమర్పించుకుని భారత్ ఓటమి కారణమయ్యాడు. తొలి టీ20 వర్షం కారణంగా రద్దైన విషయం తెలిసిందే. రెండో టీ20లో పరాజయంతో భారత్ ఐదు టీ20ల సిరీస్‌లో 1-0తో వెనుకబడింది.
- Tags
- India vs England






