'నాగబంధం' సినిమా రన్ టైమ్‌లో 20 నిమిషాల కోత

by velandi.Saikiran |

'నాగబంధం' సినిమా రన్ టైమ్‌లో 20 నిమిషాల కోత విధించారు.

నాగబంధం సినిమా రన్ టైమ్‌లో 20 నిమిషాల కోత
X

దిశ‌, వెబ్ డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల్లో నాగబంధం సినిమా (Nagabandham) సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. కలెక్షన్స్ కూడా అద్భుతంగా రాబడుతోంది. అయితే ఈ నేపథ్యంలో నాగబంధం సినిమా రన్ టైమ్ ను 20 నిమిషాల పాటు తగ్గించినట్లు చిత్ర బృందం అధికారికంగా వెల్లడించింది. శుక్రవారం థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా, రన్ టైం మొదట 3.05 గంటలుగా ఉండేది. అయితే దానిని తాజాగా 20 నిమిషాలు తగ్గించారు.

దీంతో 2.45 గంటలు మాత్రమే ఈ సినిమా ఉండనుంది. మూవీ నిడివి ఎక్కువగా ఉందని విమర్శలు వచ్చిన నేపథ్యంలో చిత్రం బృందం.. అనవసరపు సీన్లను తొలగించింది. అయితే 20 నిమిషాల సీన్స్ కట్ చేసినప్పటికీ... విమర్శలు మాత్రం తగ్గడం లేదు. సినిమా రిలీజ్ కంటే ముందు ఇవన్నీ చూసుకోవాలని కౌంటర్లు ఇస్తున్నారు. కాగా ఈ సినిమాకు అభిషేక్ నామ అదర్శకత్వం వహించారు. విరాట్ కర్ణ, నభా నటేష్ హీరో హీరోయిన్లుగా నటించారు. కాగా ఈ సినిమా మొదటి రోజునే రూ.4.67 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. వీకెండ్ కావడంతో ఈ సినిమా కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Next Story