లోకేశ్ కనగరాజ్ సినిమాలో రెజీనాకు బంప‌ర్ ఆఫ‌ర్!

by velandi.Saikiran |

సౌత్ ఇండియా దర్శకుడు లోకేష్ కనగరాజ్ మరో కొత్త ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

లోకేశ్ కనగరాజ్ సినిమాలో రెజీనాకు బంప‌ర్ ఆఫ‌ర్!
X

దిశ‌, వెబ్ డెస్క్: సౌత్ ఇండియా దర్శకుడు లోకేష్ కనగరాజ్ మరో కొత్త ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అయితే ఈ సారి నిర్మాతగా కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఖైదీ, విక్రమ్, లియో, కూలీ లాంటి బ్లాక్ బాస్టర్ సినిమాలు లోకేష్ దర్శకత్వంలోనే వచ్చాయి. అయితే ఇప్పుడు నిర్మాతగా మారుతున్న లోకేష్... లేడీ ఓరియంటెడ్ సినిమాను నిర్మించబోతున్నారట. విశాల్ వెంకట్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో రెజీనా మెయిన్ రోల్ అని తెలుస్తోంది. కథ ఇప్పటికే సిద్ధం కాగా... సినిమా షూటింగ్ కూడా త్వరలో ప్రారంభం కాబోతున్నట్లు టాక్ నడుస్తోంది. ప్రస్తుతం లోకేష్ డీసీ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఆ కార్యక్రమం పూర్తికాగానే ఈ లేడీ ఓరియంటెడ్ సినిమాపై ఫోకస్ చేయనున్నారు లోకేష్.

Next Story