- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యూత్ కు పిచ్చెక్కిస్తున్న రాశి సింగ్ కు బంపర్ ఆఫర్ ?
రాశి సింగ్ కు నందమూరి బాలయ్య సినిమాలో అవకాశం వచ్చినట్లు టాలీవుడ్ సర్కిల్స్ లో ఓ న్యూస్ వైరల్ గా మారింది.

దిశ, వెబ్ డెస్క్: తెలుగు సినిమా పరిశ్రమలో చాలా మంది హీరోయిన్లు వస్తున్నారు. అయితే ఇందులో కొంతమంది మాత్రమే పాపులర్ అయి.. నిలదొక్కుకో గలుగుతున్నారు. అలాంటి వారిలో నటి రాశి సింగ్ ఒకరు. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఈ అందాల తార ఫోటోలు మాత్రమే దర్శనమిస్తూ ఉంటాయి. అంతలా రాశి సింగ్ పాపులర్ అయ్యారు. 2021లో పోస్టర్ సినిమాతో తెలుగు వెండితెరకు ఆమె పరిచయమయ్యారు. అనంతరం శశి, ప్రేమ్ కుమార్, భూతద్దం భాస్కర్ నారాయణ, ప్రసన్న వదనం, సంతాన ప్రాప్తిరస్తు లాంటి సినిమాలు చేసి సందడి చేశారు.
ఇక లేటెస్ట్ గా ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులు సినిమాలో వడ్డే నవీన్ సరసన నటించి, అందరిని మెప్పించారు రాశి సింగ్. అయితే అలాంటి రాశి సింగ్ కు నందమూరి బాలయ్య సినిమాలో అవకాశం వచ్చినట్లు టాలీవుడ్ సర్కిల్స్ లో ఓ న్యూస్ వైరల్ గా మారింది. బాలయ్య, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో కొత్త సినిమా వస్తోంది. ఈ మూవీలో రాశి సింగ్ కు స్పెషల్ రోల్ దక్కిందట. ఓ కీలక పాత్ర కోసం రాశి సింగ్ ను చిత్ర బృందం సంప్రదింపులు చేసినట్లు టాక్ నడుస్తోంది. అయితే ఈ ఆఫర్ కు రాశి సింగ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.






