టీఎంసీ ఘోర ఓటమి పై హీరో నిఖిల్ సంచలన పోస్ట్!

by Malleboina Mahesh |

బెంగాల్ ఎన్నికల ఫలితాల వేళ హీరో నిఖిల్ చేసిన పోస్ట్ సంచలనం రేపుతోంది. సామాన్యులను పట్టించుకోని ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పారని, బాధితురాలికి న్యాయం జరిగిందని ఆయన పేర్కొన్నారు.

టీఎంసీ ఘోర ఓటమి పై హీరో నిఖిల్ సంచలన పోస్ట్!
X

దిశ, వెబ్ డెస్క్: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ (BJP) సంచలన విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు దిశగా ముందుకు సాగుతోంది. ఈ ఫలితాలపై టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ (Hero Nikhil Siddharth) ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బెంగాల్ ప్రజలు దేనినీ మర్చిపోలేదని, అలాగే క్షమించ లేదని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా సామాన్య పౌరుల భద్రతను, అవసరాలను విస్మరించిన ప్రభుత్వానికి అక్కడి ఓటర్లు తగిన బుద్ధి చెప్పారని నిఖిల్ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.

కోల్‌కతాలోని ఆర్‌.జి. కర్ మెడికల్ కాలేజీలో ఒక జూనియర్ డాక్టర్‌పై జరిగిన హేయమైన అత్యాచారం, హత్య ఉదంతాన్ని ఉద్దేశించి నిఖిల్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు స్పష్టమవుతోంది. ఆ బాధితురాలికి ఇప్పుడు న్యాయం జరిగిందని ఆయన అభిప్రాయపడ్డారు. మమతా బెనర్జీ నేతృత్వంలోని ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఈ ఎన్నికల ఫలితాల్లో ప్రతిబింబించిందని నిఖిల్ పరోక్షంగా చురకలు వేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది.

Next Story