TET అభ్యర్థులకు అల‌ర్ట్.. దరఖాస్తులకు నేడే ఆఖరు తేదీ

by velandi.Saikiran |

TET అభ్యర్థులకు అల‌ర్ట్.. దరఖాస్తులకు నేడే ఆఖరు తేదీ కావ‌డం గ‌మ‌నార్హం.

TET అభ్యర్థులకు అల‌ర్ట్.. దరఖాస్తులకు నేడే ఆఖరు తేదీ
X

దిశ‌, వెబ్ డెస్క్: TET అభ్యర్థులకు బిగ్ అలర్ట్. ఆంధ్రప్రదేశ్ టెట్-2026 దరఖాస్తులకు నేటితో గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలో అర్హత గల అభ్యర్థులు ఈ https://tet2dsc.apcfss.in/ వెబ్సైట్ లో అప్లై చేసుకోవాలని ఏపీ అధికారులు కీలక సూచనలు చేశారు. జులై 25వ తేదీ నుంచి హాల్ టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. ఇక ఆగస్టు 5వ తేదీ నుంచి 21వ తేదీ వరకు ప్రతి రోజు రెండు సెష‌న్స్ లో ఈ టెట్ పరీక్షలు నిర్వహిస్తారు. సెప్టెంబర్ 15వ తేదీన ఫలితాలు వెల్లడిస్తామని ఇప్పటికే ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. అక్టోబర్ మాసంలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే టెట్ పరీక్షలకు సంబంధించిన త‌తంగం తొందరగా పూర్తి చేయాలన్న లక్ష్యంతో అధికారులు ముందుకు వెళ్తున్నారు.

Next Story