- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జాతీయ రహదారిపై అర్ధరాత్రి బస్సు బోల్తా
జాతీయ రహదారిపై అర్ధరాత్రి పెను ప్రమాదం తప్పింది.

దిశ, అలంపూర్: జాతీయ రహదారిపై అర్ధరాత్రి పెను ప్రమాదం తప్పింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం లేదా అజాగ్రత్త కారణంగా అర్ధరాత్రి వేళ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఏపీలోని హిందూపురం నుండి హైదరాబాద్ రూట్‌లో 22 మంది ప్రయాణికులతో మార్నింగ్ స్టార్ బస్సు వెళుతుండగా.. గద్వాల జిల్లాలోని మానవపాడు స్టేజీ సమీపంలో వెనుక నుండి లారీ ఢీ కొట్టడంతో బస్సు బోల్తా పడింది. ప్రమాద సమయంలో ప్రయాణికుల అరుపులతో ఆ ప్రాంతం దద్దరిల్లింది.
అర్ధరాత్రి ఆ చీకట్లో బస్సు బోల్తా పడడంతో ఏం జరిగిందో తెలియక గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు ప్రాణాలు అరచేత పెట్టుకొని బస్సులో నుంచి బయటపడ్డారు. ఈ ప్రమాదంలో ట్రావెల్స్ బస్సులో ఉన్న చిన్న బసవ, వినీత, నవీన్ కుమార్ రెడ్డి, జ్యోతి, ఘాజి సహా 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు. మానవపాడు, ఉండవెల్లి, వడ్డేపల్లి మండలాల నుంచి హుటాహుటిన మూడు అంబులెన్స్ వాహనాలతో సిబ్బంది సకాలంలో సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను కర్నూలు జీజీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. హైవే అథారిటీ సిబ్బంది హుటాహుటిన ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని దర్యాప్తు చేపట్టారు. జాతీయ రహదారి పై విస్తరణ పనులు జరుగుతుండడంతో వాహనాలు వెళ్లడానికి కాస్త ఇబ్బందిగా మారింది.






