- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నల్లగొండలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్
నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలోని పెద్దకాపర్తి గ్రామ శివారులో జాతీయ రహదారి 65 పై ఉన్న యూటర్న్ వద్ద ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు

దిశ, చిట్యాల: నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలోని పెద్దకాపర్తి గ్రామ శివారులో జాతీయ రహదారి 65 పై ఉన్న యూటర్న్ వద్ద ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. తెలిసిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కారును పెద్దకాపర్తి శివారులోని పెద్ద చెరువు కట్ట సమీపంలోని యూ టర్న్ వద్ద కారును వెనుక నుండి విశాఖపట్నం నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఆర్షియా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. బస్సు, కారును వెనుక నుండి అతివేగంగా ఢీకొట్టడం మూలంగా కారు పల్టీలు కొట్టి నుజ్జునుజుగా మారింది. ఈ సంఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు పిల్లలతో పాటు ఒక ఆడ, మగ వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. వీరి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సంఘటన జరిగిన వెంటనే సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కారు నుజ్జునుజ్జు కావడంతో అందులో ఉన్న వ్యక్తులను బయటకు తీసేందుకు పోలీసులు తీవ్రంగా కష్టపడ్డారు. గ్యాస్ కట్టర్ మెషిన్ సహాయంతో కారు భాగాలను కట్ చేసి అందులోని వ్యక్తులను బయటకు తీశారు. అనంతరం వారిని పోస్టుమార్టం నిమిత్తం నల్గొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన డ్రైవర్ ను చికిత్స నిమిత్తం నార్కట్‌పల్లి కామినేని ఆసుపత్రికి తరలించినట్లుగా ఎస్సై రవికుమార్ తెలిపారు. జాతీయ రహదారిపై ఈ ప్రమాద సంఘటన జరగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో ట్రాఫిక్ ను క్లియర్ చేసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. సంఘటన స్థలాన్ని నార్కెట్పల్లి సీఐ సురేష్ సందర్శించి పరిశీలించాడు. అతివేగమే ఈ సంఘటనకు గల ప్రధాన కారణమా? మరి ఏదైనా ఉందా? అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.






