- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘కుడా’పై ఏజీ, విజిలెన్స్ నజర్..!
వరంగల్ కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో చేపట్టిన భూముల వేలంకు సంబంధించి రాజకీయంగా రోజుకో మలుపు తిరుగుతుంది.

దిశ,వరంగల్ బ్యూరో: వరంగల్ కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో చేపట్టిన భూముల వేలంకు సంబంధించి రాజకీయంగా రోజుకో మలుపు తిరుగుతుంది. ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తుండగా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, కూడా చైర్మన్ చేసిన విజ్ఞప్తితో ఏకంగా బీఆర్ఎస్ హయాంలో పదేళ్లపాటు జరిగిన లావాదేవీలపై ఆడిటింగ్, విజిలెన్స్ ఎంక్వైరీని మొదలు పెట్టారు. పదేళ్ల కాలంలో కుడా పరిధిలో భూముల వేలం కేటాయింపులపైన నిధుల ఖర్చు పైన ఆడిటింగ్ కొనసాగుతుంది. రాజకీయంగా ఆరోపణలు ప్రత్యారోపణలు జరుగుతున్న సమయంలో ఈ ఆడిటింగ్ విజిలెన్స్ దర్యాప్తు మరింత ఆజ్యం పోస్తుంది. కాంగ్రెస్ హయాంలో వేలం వేసిన భూముల్లో కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. చర్చకు పిలవడంతో పాటు చివరకు భద్రకాళి దేవాలయం సాక్షిగా ప్రమాణాలకు సిద్ధమయ్యారు.
ఆడిటింగ్ విజిలెన్స్ దర్యాప్తుతో కుడా వ్యవహారం మరో మలుపు తిరుగుతుండగా అప్పుడు పనిచేసిన ఉద్యోగులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. వరంగల్ కుడా ఆధ్వర్యంలో భూముల వేలం రాజకీయ ఉద్రిక్తలకు దారి తీస్తుంది. కాంగ్రెస్ హయాంలో చేపట్టిన ఓసిటీ, బాలసముద్రం ప్లాట్ల వేలం పై ఆరోపణలు పెరిగాయి. బీజేపీ, బీఆర్ఎస్ నేతలు ఈ వేలంలో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని మార్కెట్ ధర కన్న తక్కువ ధరకు ప్లాట్ల అమ్మకాలు చేశారని ఆరోపణలు చేస్తున్నారు. గడిచిన నెల రోజులుగా ఈ వేలంపై రాజకీయంగా ఉద్రిక్తతలకు దారి తీసింది. అధికార కాంగ్రెస్ పార్టీ నేతలకు కుడా చైర్మన్ ఎమ్మెల్యేలు బీజేపీ, బీఆర్ఎస్ ఆరోపణలు తిప్పికొడుతుండగా ఆ రెండు పార్టీల నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. తమ అనియులకు కట్టబెట్టేందుకే ఫిక్సింగ్ చేశారని ఆరోపణలు చేశారు. వీటిని నగర ఎమ్మెల్యేలు, కూడా చైర్మన్ తిప్పికొట్టారు. నిబంధనల మేరకు చేశారని ప్రకటించారు.
నిధుల వ్యవహారంపై దృష్టి..
ఈ ఆరోపణలు ప్రత్యారోపణల మధ్య కాంగ్రెస్ పార్టీ నేతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేలతో కుడా చైర్మన్ నిర్ణయం తీసుకోవడంతో పాటు బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో కుడా ఆధ్వర్యంలో చేపట్టిన ప్లాట్ల అమ్మకాలు, నిధుల వ్యవహారంపై దృష్టి పెట్టారు. కుడా నిధులను ఇతర మున్సిపాలిటీలకు, ఇతర పనులకు మళ్లించడం పై సీరియస్ కావడంతో పాటు ఆడిట్ ద్వారా వివరాలను బయటకు తెచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వానికి లేఖ రాయడంతో గడిచిన మూడు రోజులుగా ఏజీ ఆడిట్ అధికారులు కుడా పరిధిలో ఆడిటింగ్ చేపట్టారు. పదేళ్ల నుంచి చేపట్టిన భూములపై వేలం, వచ్చిన నిధులపై దృష్టి పెట్టారు. పదేళ్లలో జరిగిన కుడా కార్యకలాపాలు, నిధుల వ్యవహారం, ఖర్చుపైన దృష్టి సారించడంతో పాటు అన్ని ఫైళ్లను పరిశీలిస్తున్నారు.
కుడాకు సంబంధించిన 45కోట్లకు పైగా రూపాయలు ఇతర మున్సిపాలిటీలకు తరలించడంపై ఆరా తీయడంతో పాటు ఆ వివరాలను తీసుకుంటున్నారు. పూర్తిస్థాయిలో ఆడిట్ చేసి రెండు నెలల్లో పదేళ్లకు సంబంధించిన వివరాలను అందించేందుకు సిద్ధమవుతున్నారు. పూర్తిస్థాయి నివేదికను ప్రభుత్వానికి అందించనున్నారు. బీఆర్ఎస్ హయాంలో పదేళ్లపాటు కుడాకు సంబంధించిన నిధుల వ్యవహారంలో ఆడిటింగ్ ను చేపట్టలేదు. ఇప్పుడు చేపట్టడం వల్ల అధికారుల్లోనూ అలజడి మొదలైంది.అప్పటి నేతలు,అధికారులు చెప్పిన విధంగా నిధులు ఖర్చు చేయడం వల్ల తమకెక్కడ చుట్టుకుంటుందేమోనని వారు ఆందోళన చెందుతున్నారు. పూర్తిస్థాయిలో ఆడిటింగ్ రిపోర్టు వస్తే అప్పుడు పనిచేసిన అధికారులపైన కూడా అవకతవకలు ఉంటే చర్యలు చేపట్టే అవకాశం ఉండటంతో ఉద్యోగుల్లో అలజడి మొదలైంది. ఆడిటింగ్ తో పాటు ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి లేఖ రాయడంతో అప్పుడు వేలం వేసిన ప్లాట్ల పైన విజిలెన్స్, ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు కూడా తనిఖీలు చేపడుతున్నారు. కుడా పరిధిలో పదేళ్లలో లే అవుట్ ప్లాట్లు వరంగల్ నగరం పరిధిలో ఎన్ని చేశారు, ఎన్ని ప్లాట్లు అమ్మకాలు చేశారు. ఎన్ని నిధులు కుడాకు వచ్చాయి, ఆ నిధులు దేనికి ఖర్చు పెట్టారో ఆరా తీస్తున్నారు. పూర్తిస్థాయిలో తనిఖీలు చేపట్టి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.
కుడా భూముల వేలం వ్యవహారం వరంగల్ పరిధిలో రాజకీయ ఉద్రిక్తలకు దారి తీయగా కాంగ్రెస్ నేతలు ప్రభుత్వం దృష్టికి తీసుకు పోయి చేపట్టిన ఆడిటింగ్, విజిలెన్స్ దర్యాప్తు మిగతా పార్టీల్లోనూ చర్చకు దారి తీసింది. బీఅరెస్ పదేళ్ల కాలంలో కుడాకు సంబంధించిన నిధులను దారి మళ్లించారని చైర్మన్ వెంకట్ రాంరెడ్డి ఆరోపించారు. నిధులను ఇతర మున్సిపాలిటీలకు మళ్లించారని తెలిపారు. హుజరాబాద్ ఉప ఎన్నికల సమయంలో కూడా నిధులను వెచ్చించారని విమర్శించారు. ఏజీ ఆడిటింగ్, విజిలెన్స్ దర్యాప్తు ద్వారా అన్ని విషయాలు బయటకు వస్తాయని అన్నారు. అప్పటి ప్రభుత్వం కోట్ల రూపాయల భూమిని పార్టీ కోసం కేటాయించిందని ఇప్పుడు దాని రేటు 150 కోట్లకు పైగా ఉంటుందని ఆయన ఆరోపించారు.






