- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అనుమతులు నిల్.. ఫీజులు ఫుల్..
పెద్ద అంబర్పేట్ పరిధిలోని కుంట్లూరు రోడ్ లో అ క్రమంగా ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా పుట్టగొడుగులా వీ ఆర్ కాలేజ్ పుట్టుకొచ్చింది.

దిశ, అబ్దుల్లాపూర్ మెట్ : అబ్దుల్లాపూర్ మెట్ మండలం పెద్ద అంబర్పేట్ పరిధిలోని కుంట్లూరు రోడ్ లో అ క్రమంగా ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా పుట్టగొడుగులా వీ ఆర్ కాలేజ్ పుట్టుకొచ్చింది. విద్యార్థులకు మాయ మాటలు చెప్పి వలవిసిరింది. లక్షలాది రూపాయలు వి ద్యార్థుల వద్ద వసూలు చేస్తూ, ప్ర భుత్వ అనుమతులు తీసుకోకుండా ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నది. కాలేజీ యాజమాన్యం విద్యాధికారులను చేతిలో పెట్టుకొని, ప్ర భుత్వానికి చెల్లించాల్సిన ఫీజులు చె ల్లించకుండా ఇష్టానుసారంగా ప్రైవే ట్ కాలేజీ యాజమాన్యం ప్రవర్తిస్తున్నారు. కాలేజీ నిర్వహించాలంటే విద్యార్థులకు అన్ని వసతులు ఉం డాలి. విశాలమైన తరగతి గదులు, క్రీడా మైదానం, ప్రస్తుతం మారుతు న్న సాంకేతికతకు అనుగుణంగా ల్యాబ్స్, సేఫ్టీ, అర్హత కలిగినబోధకులను కాలేజీలో నియమించాలి. కా లేజీ భవనానికి ఎలాంటి శబ్ద కాలు ష్యం, ట్రాఫిక్ సమస్యలు లేకుండా కొన్ని ప్రమాణాలతో కూడిన అర్హత లు కలిగి ఉండాలి. కానీ ఇ ప్పుడు న్న ప్రస్తుతం కాలేజీలో ఇలాంటి నిబంధనలు పాటించకుండా ధనార్జ నే ధ్యేయంగా విద్యార్థుల భవిష్యత్తు తో ప్రైవేట్ యాజమాన్యాలు చెలగాటమాడుతున్నారు. లక్షలాది రూపా యల ఫీజులు, వేలాది రూపాయల బుక్కుల అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి.
ఆందోళన చేసినా స్పందన కరువు
ఈ విషయంపై పలు విద్యార్థి సం ఘాలు ఆందోళన చేసినప్పటికీ వి ద్యాధికారుల నుంచి ఎలాంటి స్పం దన లేకపోవడం గమనార్వం, ప్రభు త్వ నాంస్కు విరుద్ధంగా కళాశాల లో బుక్కుల వ్యాపారం మూడు పూలు ఆరు కాయల చందంగా వర్ధిల్లుతుంది. అయినా ముడుపులు అం దుకుని అనుమతులు లేని ప్రైవేట్ కళాశాల వైపు కన్నెత్తి చూడడంలో ప్రభుత్వ అధికారుల వైఫల్యం కనబడుతుంది.
స్పందించని డీఐవో వెంకయ్య నాయక్
ఈ విషయంపై విద్యార్థి సంఘాలు, మీడియా ఎవరైనా ఎన్ని మార్లు ఫోన్ చేసినా కనీస స్పందన ఇవ్వడం లో ఇంటర్మీడియట్ విద్యాధికారి వెంకయ్య నాయక్ తీరే వేరు. ఒక అధికారి బాధ్యతగా కనీసం ఫోన్ ఎత్తి సమాచారాన్ని తీసుకునే పరిస్థితిలో లేకపోవడం దురదృష్టకరమని విద్యార్థి సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
వీఆర్ కాలేజీ సీజ్ చేయాలి..
సంబంధిత ప్రభుత్వ విద్యాధికారులు, కనీసం ప్రభుత్వ అను మతు లు లేకుండా చలామనుతున్న వీ ఆర్ కాలేజ్‌పై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాం డ్ చేస్తున్నారు. సంబంధిత యా జమాన్యంపై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల భవిష్యత్తును కా పాడాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.






