నేడే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య ఫైనల్

by velandi.Saikiran |

నేడే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య ఫైనల్ ఇవాళ జ‌రుగ‌నుంది.

నేడే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య ఫైనల్
X

దిశ‌, వెబ్ డెస్క్: మహిళల టీ20 ప్రపంచ కప్ చివరి దశకు చేరుకుంది. నేడు ఈ టోర్నమెంట్ ఫైనల్ జరగనుంది. రాత్రి 8 గంటలకు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మహిళలకు మధ్య ఫైనల్ ఫైట్ ఉండనుంది. ఈ టోర్నమెంట్ లో ఓటమి లేకుండా చివరి దశకు చేరుకున్నాయి రెండు జట్లు. ఇక ఈ ఫైనల్ లోనూ గెలిచి వరల్డ్ కప్ ను రికార్డు స్థాయిలో ఏడవసారి అందుకోవాలని ఆస్ట్రేలియా మాస్టర్ ప్లాన్ వేసింది.

రికార్డు 17 ఏళ్ల తర్వాత మరోసారి గెలవాలని ఇంగ్లాండ్ మహిళల జట్టు ప్రణాళికల సిద్ధం చేస్తోంది. రెండు జట్లు బలంగా ఉన్న నేపథ్యంలో మ్యాచ్ చాలా ఉత్కంఠ భరితంగా సాగనుంది. అయితే నేటి మ్యాచ్ లో టాస్ చాలా కీలకంగా మారనుంది. టాస్ గెలిచిన జట్టు, విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.

Next Story