మరో కొత్త సినిమాకు సమంత గ్రీన్ సిగ్నల్?

by velandi.Saikiran |

హారర్ నేపథ్యంలో ఉన్న ఓ కథకు సమంత సైన్ చేశారట.

మరో కొత్త సినిమాకు సమంత గ్రీన్ సిగ్నల్?
X

దిశ‌, వెబ్ డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు 18 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సమంత...ఇప్పటికి టాప్ మోస్ట్ హీరోయిన్ గానే కొనసాగుతున్నారు. అలాంటి హీరోయిన్ సమంత, సెకండ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత మరింత దూకుడు పెంచారు. ఇక ఇటీవల మా ఇంటి బంగారం సినిమాతో బంపర్ హిట్ అందుకుంది. ఈ మూవీ రూ.100 కోట్ల క్లబ్ లో కూడా చేరింది. మా ఇంటి బంగారం సినిమా హిట్ తో మంచి ఊపు మీద ఉన్న సమంత మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెబుతున్నారు.

హారర్ నేపథ్యంలో ఉన్న ఓ కథకు సమంత సైన్ చేశారట. అరుంధతి రేంజ్ లో ఈ సినిమా ఉంటుందని టాక్ నడుస్తోంది. అయితే ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి చాలా రోజుల సమయం పడుతుందని అంటున్నారు. సమంత ప్రస్తుతం ప్రెగ్నెంట్ అన్న సంగతి తెలిసిందే. ఆమె డెలివరీ పూర్తయిన తర్వాత... ఈ హారర్ మూవీ షూటింగ్ ప్రారంభం కానుందట. ఈ మేరకు కథ చెప్పిన దర్శకుడు కూడా, సమంత కోసం వేటు చేసేందుకు సిద్ధమయ్యాడట. ఎన్ని రోజులైనా ఆమెతోనే ఈ హారర్ సినిమా చేస్తానని గట్టిగానే ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. కాగా గతంలో కూడా హారర్ సినిమాలు సమంత చేశారు.

Next Story