- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
VIRAL: మనుషులపై రోబో ఎదురుదాడి.. ‘బ్రూస్ లీ’ లెవల్‌లో బిగ్ ఫైట్! (వీడియో)
ఓ హ్యూమనాయిడ్ రోబో ఉన్నట్టుండి మనుషులపై ఒక్కసారిగా విరుచుకుపడి దాడి చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: సూపర్‌స్టార్ రజినీకాంత్ నటించిన రోబో (Robo) మూవీ మనం చేసే ఉంటాం. క్లైమాక్స్‌లో హీరోయిన్ కోసం ఆ రోబో చేసిన రచ్చ మాములుగా ఉండదు. తనను సృష్టించిన వారిని సైతం హతమార్చేందుకు అది వెనుకాడదు. అయితే, ప్రస్తుతం అచ్చం అలాంటి ఘటనే తాజాగా ఇండోనేషియాలో చోటుచేసుకుంది. హ్యూమనాయిడ్ రోబో ఎగ్జిబిషన్‌లో ఓ సంస్థకు చెందిన ప్రతినిధులు తమ రోబోను ప్రదర్శనకు ఉంచారు. ఈ క్రమంలోనే ఆ రోబో సాధారణంగా వస్తువులను ఎత్తడానికో, పనులు చేయడానికో వాడే రోబోలా కాకుండా.. ఏకంగా ఓ ప్రొఫెషనల్ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్‌లా ప్రవర్తించింది. గాల్లోకి లేస్తూ కిక్స్ (Kicks) ఇస్తూ, పంచ్‌లు విసురుతూ అక్కడున్న వారిపై దాడికి తెగబడింది. ఈ ఊహించని అటాక్‌తో తీవ్ర భయాందోళనకు గురైన అక్కడి జనాలు ఒక్కసారిగా పరుగులు తీశారు. ఈ క్రమంలో కొందరికి స్వల్ప గాయాలైనట్లుగా తెలుస్తోంది.
‘బ్రూస్ లీ’ లెవల్లో పోజులు.. వీడియో వైరల్
అయితే, ఆ హ్యుమనాయిడ్ రోబో చేసిన ఫైట్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మనుషులను కొట్టి కాసేపు శాంతించిన ఆ రోబో.. లెజెండరీ ఫైటర్ ‘బ్రూస్ లీ’ తరహాలో ఒక చేతిని ముందుకు చాపి, మరో చేతిని వెనక్కి పెట్టి అచ్చం సినిమా స్టైల్లో ఫైటింగ్ పోలిచ్చిందండోయ్. ఈ వింతైన దృశ్యాలను అక్కడ ఉన్న కొందరు తమ మొబైల్స్‌లో రికార్డ్ చేయడంతో ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ‘ఫ్యూచర్‌లో భవిష్యత్తులో రోబోలతో ప్రమాదం పొంచి ఉందనడానికి ఇదే నిదర్శనం’ అని కొందరు కామెంట్స్ చేస్తుంటే.. ‘దాడి చేయడం సరే, ఆ బ్రూస్ లీ పోజు ఏంటి సామీ!’ అంటూ మరికొందరు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు.






