- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారత జానపద రంగంలో తీవ్ర విషాదం.. ప్రముఖ పోక్ సింగర్ తీజన్ బాయి కన్నుమూత
ప్రముఖ భారతీయ జానపద కళాకారిణి, పద్మవిభూషణ్ గ్రహీత తీజన్ బాయి (70) కన్నుమూశారు.

దిశ, వెబ్‌డెస్క్: భారతీయ జానపద సంగీత ప్రపంచంలో ఓ మధుర శకం ముగిసింది. ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh)కు చెందిన ప్రముఖ ఫోక్ సింగర్, లెజెండరీ ‘పాండవాని’ జానపద కళాకారిణి తీజన్ బాయి (70) ఇవాళ కన్నుమూశారు. కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలు, అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె రాయ్‌పూర్‌లోని ఎయిమ్స్ (AIIMS) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.
కాగా, మహాభారతంలోని ప్రముఖ ఘట్టాలను తనదైన విలక్షణమైన పాటలు, నృత్య ప్రదర్శనల ద్వారా ప్రజలకు వివరిస్తూ ఆమె అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. భారతీయ సంస్కృతికి, జానపద కళలకు ఆమె చేసిన విశేష సేవలకుగాను భారత ప్రభుత్వం ఆమెను అత్యున్నత పురస్కారాలతో సత్కరించింది. తీజన్ బాయి 1988లో పద్మశ్రీ, 2003లో పద్మభూషణ్, 2019లో పద్మవిభూషణ్ అవార్డులను అందుకున్నారు. అయితే, తీజన్ బాయి మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.






