- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > నల్లగొండ > ఖాజీరామారంలో విషాదం.. చేపలు పట్టేందుకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి
ఖాజీరామారంలో విషాదం.. చేపలు పట్టేందుకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి
by Jakkula.Mamatha |
తిప్పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖాజీరామారం గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

X
దిశ, నల్లగొండ క్రైమ్: తిప్పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖాజీరామారం గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నిన్న(శనివారం) పాఠశాల ముగిసిన అనంతరం మణి భార్గవ్(13) మరియు వినయ్(10) అనే ఇద్దరు బాలురు చేపలు పట్టేందుకు గాలాలు తీసుకొని గ్రామ సమీపంలోని బావి వద్దకు వెళ్లారు. ఈ తరుణంలో ఇద్దరూ ప్రమాదవశాత్తు బావిలో పడిపోయారు. ఈ విషయమై తిప్పర్తి సబ్ ఇన్‌స్పెక్టర్ వి.శంకర్ సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని, అగ్నిమాపక శాఖ సిబ్బంది సహాయంతో బావిలో మునిగి పోయిన ఇద్దరు బాలురను బయటకు తీశారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిర్వహించి తదుపరి చర్యలు చేపట్టారు.
Next Story






