- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారత్ ఘోర ఓటమి..వైభవ్ డెబ్యూ కలిసి రాలేదంటూ విమర్శలు ?
ఇంగ్లండ్ చేతిలో భారత్ ఘోర ఓటమి పాలైంది.

దిశ, వెబ్ డెస్క్: భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య శనివారం రెండో టీ20 జరిగింది. ఈ నేపథ్యంలో గెలవాల్సిన ఈ మ్యాచ్ ను చేజేతులా భారత్ పోగొట్టుకుంది. ఇంగ్లాండ్ చేతిలో నాలుగు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్, 20 ఓవర్స్ ఆడి 190 పరుగులు సాధించింది. ఈ క్రమంలో ఏడు వికెట్లు నష్టపోయింది. అయితే ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో, వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఇంగ్లాండ్ ముందుకు సాగింది.
ఈ క్రమంలో 19 ఓవర్లలో మ్యాచ్ గెలిచేసింది. అయితే వైభవ్ డెబ్యూ చేసిన మ్యాచ్ లోనే భారత్ ఓడిపోవడం పట్ల సోషల్ మీడియాలో సరికొత్త చర్చ మొదలైంది. సంజూ స్థానంలో వైభవ్ కు అవకాశం ఇస్తే... సరిగ్గా ఆడలేదని కొంతమంది ట్రోలింగ్ చేస్తుంటే... అతడు ఆడడం వల్ల భారత్ ఓడిపోయిందని మరి కొంతమంది అంటున్నారు. వైభవ్ స్థానంలో సంజునే ఆడి ఉంటే, భారత్ కచ్చితంగా గెలిచేదని అంచనా వేస్తున్నారు. అనవసరంగా 15 ఏళ్ల కుర్రాడిని తీసుకున్నారని ఇప్పుడు మరికొంతమంది తమ వాదన వినిపిస్తున్నారు.






