- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BREAKING : కరాచీలో తీవ్ర ఉద్రిక్తత.. 9 మంది మృతి
ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణంతో పాకిస్థాన్‌లోని కరాచీ నగరం రణరంగంగా మారింది.

దిశ, వెబ్‌డెస్క్: ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణంతో కరాచీలో నిరసనకారుల ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకున్నాయి. తమ మత గురువుగా భావించే వ్యక్తి అమెరికా - ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో మరణించడంతో ఆందోళన చేపట్టారు. కరాచీలో ఉన్న యూఎస్ కాన్సులేట్ ను ముట్టడించి, నిప్పంటించడంతో పోలీసులు వారిని చెదరగొట్టి టియర్ గ్యాస్ ప్రయోగించారు. నిరసన కారుల ఆందోళనతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నిరసనకారులకు, పోలీసులకు మధ్య జరిగిన తీవ్ర ఘర్షణల్లో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా.. 18 మంది ఆందోళనకారులు గాయపడ్డారు.
అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీ మరణించారన్న వార్తతో ఆగ్రహించిన షియా సమాజానికి చెందిన ప్రజలు పెద్ద ఎత్తున కరాచీలోని ఎం.టీ ఖాన్ రోడ్డు మీదుగా అమెరికా ఎంబసీని ముట్టడించేందుకు వెళ్లారు. నిరసనకారులు ఎంబసీ సమీపంలోకి చేరుకోగానే పరిస్థితి అదుపు తప్పింది. నిరసనకారులు ఎంబసీ కిటికీలు, తలుపులను ధ్వంసం చేసి, గార్డు రూమ్‌పై కర్రలతో దాడి చేశారు. భవనంలోని కొన్ని భాగాలకు నిప్పు పెట్టారు. గుంపును చెదరగొట్టడానికి పోలీసులు తొలుత టియర్ గ్యాస్ ను ప్రయోగించి, లాఠీచార్జ్ చేశారు. ఆ తర్వాత హెచ్చరికగా గాలిలోకి కాల్పులు జరిపారు. ఈ క్రమంలో జరిగిన కాల్పుల్లో తొమ్మిది మంది మరణించినట్లు ఈధి రెస్క్యూ సర్వీస్ (Edhi) ధృవీకరించింది. మృతదేహాలను, గాయపడిన వారిని కరాచీ సివిల్ హాస్పిటల్ ట్రామా సెంటర్‌కు తరలించారు.
నగరంలో హై అలర్ట్
సింధ్ హోం మంత్రి జియావుల్ హసన్ లంజర్ ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. కరాచీ అడిషనల్ ఐజీ నుంచి తక్షణ నివేదిక కోరారు. ఉద్రిక్తతల దృష్ట్యా సుల్తానాబాద్ నుంచి మాయి కొలాచి వైపు వెళ్లే రహదారులను పోలీసులు మూసివేశారు. నగరవ్యాప్తంగా అదనపు బలగాలను మోహరించి, భద్రతను కట్టుదిట్టం చేశారు.






