కశ్మీర్‌లో వెల్లువెత్తిన నిరసనలు.. కరాచీలో యూఎస్ కాన్సులేట్‌కు నిప్పు?

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-03-01 09:27:38  IST  )

ఖమేనీ మరణంతో ప్రపంచంలోని షియా ముస్లింలు ఆందోళన బాటపట్టారు. ఇటు కశ్మీర్లో, అటు కరాచీలో నిరసనకారులు ఇరాన్ కు మద్దతు తెలుపుతున్నారు.

కశ్మీర్‌లో వెల్లువెత్తిన నిరసనలు.. కరాచీలో యూఎస్ కాన్సులేట్‌కు నిప్పు?
X

దిశ, వెబ్‌డెస్క్: ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ మరణంతో.. పాకిస్థాన్లోని మతస్తులు ఆందోళనకు దిగారు. కరాచీలో ఉన్న యూఎస్ కాన్సులేట్ పై దాడికి యత్నించగా.. పోలీసులు ఆందోళనకారుల్ని అడ్డుకున్నారు. కాన్సులేట్ పై కర్రలు, రాళ్లతో నిరసనకారులు విరుచుకుపడ్డారు. ఇరాన్ కు మద్దతుగా నినాదాలు చేస్తూ.. కాన్సులేట్ గేట్లను దాటుకుని లోపలికి వెళ్లి నిప్పు పెట్టేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి అదుపుతప్పింది. దీంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. భవనంలోని కొన్ని భాగాలకు నిప్పంటుకోగా.. వెంటనే ఫైరింజన్ల సహాయంతో ఆర్పివేసినట్లు తెలుస్తోంది. నిరసనకారుల ఆందోళన మిన్నంటడంతో.. అక్కడ యుద్ధ వాతావరణం నెలకొంది.

కశ్మీర్‌లో నిరసన జ్వాలలు

అయతుల్లా అలీ ఖమేనీ మరణానికి నిరసనగా జమ్మూ కాశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో భారీ ప్రదర్శనలు జరిగాయి. శ్రీనగర్‌లోని షియా ముస్లింలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి అమెరికా, ఇజ్రాయెల్ వ్యతిరేక నినాదాలు చేశారు. నిరసనకారులు ఖమేనీ చిత్రపటాలను, నల్ల జెండాలను చేతబూని సంతాపం వ్యక్తం చేశారు."మా ప్రియతమ నాయకుడు ఖమేనీ అమరుడయ్యారు" అంటూ నిరసనకారులు ఆవేదన వ్యక్తం చేశారు. నిరసనల నేపథ్యంలో కశ్మీర్‌లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు.

BREAKING : కరాచీలో తీవ్ర ఉద్రిక్తత.. 9 మంది మృతి

Next Story