10 సెమీకండక్టర్ యూనిట్లు ప్రపంచాన్ని శాసించబోతున్నాయి: ప్రధాని మోడీ

by Malleboina Mahesh |   (  Updated:2026-05-23 07:28:37  IST  )

19వ రోజ్‌గార్ మేళాలో ప్రధాని మోదీ ప్రసంగించారు. భారత్‌కు చెందిన 10 సెమీకండక్టర్ యూనిట్లు త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా ముద్ర వేయబోతున్నాయని తెలిపారు.

10 సెమీకండక్టర్ యూనిట్లు ప్రపంచాన్ని శాసించబోతున్నాయి: ప్రధాని మోడీ
X

దిశ, వెబ్ డెస్క్: రాబోయే రోజుల్లో భారత్ కు చెందిన 10 సెమీకండక్టర్ యూనిట్లు ప్రపంచాన్ని శాసించబోతున్నాయని ప్రధాని మోడీ (Prime Minister Modi) ధీమా వ్యక్తం చేశారు. 19వ రోజ్‌గార్ మేళాను ఉద్దేశించి ప్రసంగిస్తూ దేశ యువతకు ప్రధాని కీలక సందేశాన్ని ఇచ్చారు. 2047 నాటికి 'వికసిత్ భారత్' (అభివృద్ధి చెందిన భారతదేశం) నిర్మాణమే లక్ష్యంగా దేశంలోని ప్రతి భారతీయుడు ఒక గొప్ప సంకల్పంతో ముందుకు సాగుతున్నాడని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని చేరుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం వివిధ రంగాలలో భారీగా పెట్టుబడులు పెడుతోందని, ఈ వ్యూహాత్మక పెట్టుబడుల వల్ల యువతకు మిలియన్ల కొద్దీ సరికొత్త ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సృష్టించబడుతున్నాయని ప్రధాని మోడీ సంతోషం వ్యక్తం చేశారు.

ఈ పారిశ్రామిక వృద్ధి లో భాగంగా నేడు భారతదేశంలో పూర్తి స్థాయి సెమీకండక్టర్ ఉత్పాదక సరఫరా గొలుసు (Supply Chain) వేగంగా అభివృద్ధి చెందుతోందని ప్రధానమంత్రి వెల్లడించారు. రాబోయే సంవత్సరాల్లో భారతదేశానికి చెందిన 10 ప్రధాన సెమీకండక్టర్ యూనిట్లు ప్రపంచవ్యాప్తంగా తమ ప్రత్యేక ముద్రను వేయబోతున్నాయని, ఈ యూనిట్ల విజయానికి అత్యధిక బలం భారతీయ యువత నుండే లభిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మన యువత తమ మేధస్సు, ప్రతిభ, నిబద్ధత ద్వారా ప్రపంచ వేదికపై సరికొత్త రికార్డులను సృష్టిస్తారని, ఈ సెమీకండక్టర్ విప్లవం వల్ల దేశంలో అపారమైన ఉపాధి అవకాశాలు మరింతగా పెరుగుతాయని ఈ సందర్భంగా ప్రధాని మోడీ చెప్పుకొచ్చారు.

మోడీ 3.0 పాలనలో అత్యధిక లబ్ది ఏపీకే.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

Next Story