స్టార్ హీరోయిన్‌తో నాగ చైతన్య మ్యారేజ్ ప్రపోజల్.. హాట్ టాపిక్‌గా లవ్ ట్రాక్!

by  |

దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్‌లో అందమైన జంట ఎవరైనా ఉన్నారా అంటే వెంటనే గుర్తుకు వచ్చే పేరు నాగచైతన్య, సమంతనే. ఇక వీరు విడాకులు తీసుకుంటున్నామని ప్రకటించిన తర్వాత అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. వీరు మళ్లీ కలవాలని పూజలు చేసినవారు కూడా లేకపోలేదు. అలా ఎంతో మందికి అభిమాన జంటగా ఉన్నవీరు వీడాకులు తీసుకుంటాన్నామని ప్రకటించిన తర్వాత ఎవరి లైఫ్‌లో వారు చాలా బిజీ అయిపోయారు.

విడాకుల అనంతరం సామ్ తన స్నేహితులతో సంతోషంగా గడుపుతూ.. సినిమాల విషయం‌లో దూకుడు పెంచింది. అంతే కాకుండా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే సామ్ తన హాట్ ఫోటో షూట్స్‌తో రచ్చ చేస్తూనే ఉంది. అంతేకాకుండా తెలుగులో అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ’పుష్ప’లో ఫస్ట్ టైమ్ ఐటెం సాంగ్ చేస్తోంది. ఇలా వరస సినిమాలతో బిజీ అయిపోతున్న సమంత ఎప్పటికప్పుడు తన మెమరేబుల్ మూమెంట్స్‌ను సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకుంటోంది.

చైతుతో విడాకులు.. సామ్ అన్నపూర్ణ స్టూడియోస్‌కు ఎందుకొచ్చినట్లు?

ఇక చైతన్య కూడా విడాకులు తీసుకుంటున్నామని ప్రకటన తర్వాత కెరీయర్ పై ఫుల్ ‌గా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. లవ్ స్టోరి మూవీతో అదిరిపోయే విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న చై ప్రస్తుతం ‘బంగార్రాజు’, ’థాంక్యూ’, ‘లాల్ సింగ్ చద్ధా’ సినిమాల్లో నటిస్తున్నారు. అంతే కాకుండా ఓ వెబ్ సిరీస్‌లో కూడా నటిస్తున్నట్టు టాక్. అయితే నాగచైతన్య సమంత‌తో పెళ్లికి ముందు తెలుగు ఇండ్ స్ట్రీలో ఓ హీరోయిన్‌ను పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడంట. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరూ అనుకుంటున్నారా.. ప్రేమమ్ సినిమాలో నాగచైతన్యకు జోడిగా నటించిన కమల్ హాసన్ కూతురు శృతి హాసన్‌ను పెళ్లి చేసుకోవాలనుకున్నాడని అప్పట్లో సోషల్ మీడియాలో గుసగుసలు వినిపించాయి. అంతకు ముందు 2013 నుంచి వీళ్లిద్దరు డేటింగ్‌లో ఉన్నట్టు సమాచారం. కానీ వీళ్లిద్దరి ప్రేమ పెళ్లి వరకు వెళ్లలేదు. ఆ తర్వాత సమంతను నాగ చైతన్య ప్రేమ వివాహాం చేసుకున్నారు.

టాలీవుడ్‌లో హాట్ టాపిక్.. యాంకర్ రష్మిని చిరు సజస్ట్ చేశాడా.?

Telugu News , Latest Telugu News. Telangana News. Political News. Cinema News. Crime News. AP News. Web Stories. Latest Photo Galleries

Next Story

Most Viewed