- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జగన్ ప్రభుత్వాన్ని అభినందించిన ఎంపీ రఘురామ
<p>దిశ, ఏపీ బ్యూరో: రైతుల సుదీర్ఘ పోరాటం ద్వారానే వైసీపీ ప్రభుత్వం అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకుందని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు. ఇది రాష్ట్ర ప్రజలు సాధించిన గొప్ప విజయమని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ… వైఎస్ జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లు, సీఆర్డీఏ బిల్లులను రద్దు చేసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఈ విషయంలో ప్రభుత్వాన్ని అభినందిస్తున్నట్లు వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా నిరంతరం […]</p>

దిశ, ఏపీ బ్యూరో: రైతుల సుదీర్ఘ పోరాటం ద్వారానే వైసీపీ ప్రభుత్వం అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకుందని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు. ఇది రాష్ట్ర ప్రజలు సాధించిన గొప్ప విజయమని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ… వైఎస్ జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లు, సీఆర్డీఏ బిల్లులను రద్దు చేసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఈ విషయంలో ప్రభుత్వాన్ని అభినందిస్తున్నట్లు వ్యాఖ్యలు చేశారు.
మూడు రాజధానులకు వ్యతిరేకంగా నిరంతరం పోరాటం చేసిన రైతులు, వారికి సహకరించిన వారికి ఆయన అభినందనలు తెలిపారు. ఈ నిర్ణయంపై మళ్లీ వెనక్కి వెళ్లకుండా రాజధానులు మూడు కాదు రెండు అని ఎటువంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. గత ప్రభుత్వం ప్రకటించిన రాజధానిని అభివృద్ధి చేయాలని ఆయన కోరారు. అమరావతికి బీజేపీ హైకమాండ్ పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించిన తరుణంలో సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని మరో రకంగా కుట్రలు చేయొచ్చని ఎంపీ రఘురామ స్పష్టం చేశారు.






