- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్టార్ డైరెక్టర్‌తో యంగ్ హీరో రోషన్ సినిమా..? బొమ్మ అదిరిపోవాల్సిందే అంటూ కామెంట్స్
టాలీవుడ్ హీరో శ్రీకాంత్(Srikanth)తనయుడు రోషన్ మేక(Roshan Meka) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరో శ్రీకాంత్(Srikanth)తనయుడు రోషన్ మేక(Roshan Meka) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ‘నిర్మల కాన్వెంట్’(Nirmala Convent) మూవీతో ఇండస్ట్రీకి పరిచయమైన ఈ యంగ్ హీరో రీసెంట్‌గా ‘ఛాంపియన్’ మూవీతో మనముందుకు వచ్చాడు. యంగ్ బ్యూటీ అనస్వర రాజన్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి ప్రదీప్ అద్వైత్ దర్శకత్వం వహించగా.. స్వప్న సినిమాస్, జీ స్టూడియోస్, ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్ కాన్సెప్ట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించాయి.
ఇక నందమూరి కళ్యాణ్ చక్రవర్తి, అర్చన కీలక పాత్రల్లో నటించారు. అయితే క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. ఈ సినిమాలో రోషన్ నటన విమర్శకుల నుంచి ప్రశంసలందుకుంటున్నది. ఈ క్రమంలో రోషన్‌కు వరుస ఆఫర్లు తలుపు తడుతున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇందులో భాగంగా స్టార్ డైరెక్టర్ గౌతమ్ మీనన్(Goutham Menon) దర్శకత్వంలో శ్రీకాంత్ తనయుడు రోషన్ ఓ సినిమా చేసే ఛాన్స్ ఉందట. ప్రస్తుతం డిస్కర్షన్స్ జరుగుతున్నాయట. అది ఓకే అవ్వగానే వీరి కాంబోలో ఓ సినిమా పడనున్నట్లు సమాచారం. మరి ఇందులో నిజమెంతుందో తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక దీనిపై నెటిజన్లు బొమ్మ అదిరి పోవాల్సిందే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Read More..
ఆ హీరోయిన్‌కు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన ప్రభాస్.. నాకు చాలా స్పెషల్ అంటూ ఎమోషనల్ కామెంట్స్






