- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ హీరోయిన్‌కు సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన ప్రభాస్.. నాకు చాలా స్పెషల్ అంటూ ఎమోషనల్ కామెంట్స్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas)ఈ సారి కొత్త జానర్‌తో ప్రేక్షకులకు మర్చిపోలేని అనుభూతిని ఇవ్వబోతున్నాడు.

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas)ఈ సారి కొత్త జానర్‌తో ప్రేక్షకులకు మర్చిపోలేని అనుభూతిని ఇవ్వబోతున్నాడు. ప్రభాస్, మారుతి కాంబోలో తెరకెక్కిన ‘ది రాజాసాబ్’ మూవీ హారర్ కామెడీ జానర్‌లో రాబోతుంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మిస్తుండగా..నిధి అగర్వాల్, రిద్ధి కుమార్(Riddhi Kumar), మాళవిక మోహనన్(Malavika Mohanan) హీరోయిన్లుగా నటిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9న థియేటర్స్‌లోకి రాబోతుంది. ఈనేపథ్యంలో..ప్రమోషన్స్ జోరు పెంచిన చిత్రబృందం వరుస అప్డే్ట్స్ ఇస్తున్నారు. తాజాగా, ‘ది రాజాసాబ్’ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇక ఇందులో పాల్గొన్న రిద్ధి కుమార్ ఓ షాకింగ్ విషయాన్ని వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచింది.
తనకు ప్రభాస్ స్పెషల్ గిఫ్ట్ పంపినట్లు తెలుపుతూ.. డార్లింగ్‌పై ప్రశంసలు కురిపించింది. ‘‘డార్లింగ్ వల్లే నేను ‘ది రాజాసాబ్’లో నటిస్తున్నాను. నాకు ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చిన ప్రభాస్‌కు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఈరోజు ఈవెంట్‌కు మీరు నాకిచ్చిన చీరనే కట్టుకుని వచ్చాను. ఈ రాత్రి ధరించడం కోసమే నేను ఈ చీరను మూడేళ్లుగా దాచుకున్నాను. నా జీవితంలో ప్రభాస్ ఉన్నందుకు నేను చాలా కృతజ్ఞురాలిని’’ అని స్టేజ్‌పై ఎమోషనల్ అయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ విషయం తెలుసుకున్న ప్రభాస్ అభిమానులు.. ఆ హీరోయిన్ అంత స్పెషల్ ఏంటా? అని పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వీరిద్దరి మధ్య ఏమైనా సంథింగ్ సంథింగ్ ఉందా? అని పలు రకాలుగా చర్చించుకుంటున్నారు.
Read More..
నేను ఆమెకు పెద్ద ఫ్యాన్ అయిపోయాను.. ప్రభాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్






