నేను ఆమెకు పెద్ద ఫ్యాన్ అయిపోయాను.. ప్రభాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by I. Sairam |   (  Updated:2025-12-28 06:56:48  IST  )

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా మారుతి(Maruti) దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం ‘ది రాజా సాబ్’(The Raja Saab) విడుదలకు సిద్ధంగా ఉంది.

నేను ఆమెకు పెద్ద ఫ్యాన్ అయిపోయాను.. ప్రభాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా మారుతి(Maruti) దర్శకత్వంలో రూపొందుతున్న భారీ చిత్రం ‘ది రాజా సాబ్’(The Raja Saab) విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక ఈ సినిమాలో నిధి అగర్వాల్(Nidhi Agarwal), మాళవిక మోహనన్(Malavika Mohanan), రిద్ధి కుమార్(Riddhi Kumar) హీరోయిన్లుగా నటిస్తున్నారు. థమన్(Thaman) సంగీతం అందిస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టి.జి.విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాను పూర్తి హారర్ కామెడీ జోనర్‌లో రూపొందించారు మేకర్స్.

దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో సాలిడ్ బజ్ క్రియేట్ అయింది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. అయితే ఈ మూవీ జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఖైతలపూర్ గ్రౌండ్స్‌లో ది రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌ నిర్వహించింది.

ఇక ఈ ఈవెంట్‌లో పాల్గొన్న ప్రభాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో మా నాన్నమ్మను చూసి నా సీన్లు కూడా మర్చిపోతున్నాను. నేను మా నాన్నమ్మ ఫ్యాన్ అయిపోయాను. ఈ సినిమాలో నాతో పాటు మా నాన్నమ్మ కూడా ఒక హీరో. ఈ సినిమా నాన్నమ్మ - మనవడి కథ’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

Read More..

పబ్లిక్‌లో ప్రభాస్‌ను డైనోసర్‌తో పోల్చిన నిర్మాత.. (వీడియో)

నిధి పాపని పెళ్లి చేసుకోవాలంటే ఎంత ఆస్తి ఉండాలి? ఫ్యాన్ ప్రశ్నచూసి ఆశ్చర్యపోయిన ప్రభాస్

Next Story