పబ్లిక్‌లో ప్రభాస్‌ను డైనోసర్‌తో పోల్చిన నిర్మాత.. (వీడియో)

by Gantepaka Srikanth |   (  Updated:2025-12-28 04:43:18  IST  )

పబ్లిక్‌లో ప్రభాస్‌ను డైనోసర్‌తో పోల్చిన నిర్మాత.. (వీడియో)

పబ్లిక్‌లో ప్రభాస్‌ను డైనోసర్‌తో పోల్చిన నిర్మాత.. (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: ది రాజాసాబ్(The RajaSaab Movie) ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో నిర్మాత ఎస్‌కేఎన్(SKN) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హీరో ప్రభాస్(Prabhas) ఎదుటే.. ప్రభాస్‌ను డైనోసర్‌తో పోల్చారు. ప్రతీ సంక్రాంతికి పందాలు కోళ్ల మీద వేస్తాం.. ఈసారి డైనోసర్ మీద వేయబోతున్నామని అన్నారు. రాసిపెట్టుకోండి ఈ సినిమా ఎవరూ ఊహించనంత పెద్ద విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అంతకుముందు ప్రభాస్ మాట్లాడుతూ.. ఇప్పటివరకూ ఎవరూ చూడని సరికొత్త స్టోరీతో వస్తున్నాం.. నా సినిమాలన్నీ యాక్షన్‌ జానర్‌ అయిపోతున్నాయని మారుతితో అంటే.. హారర్‌ కామెడీని మీకోసం సిద్ధం చేశారు. కథ క్లైమాక్స్‌కు వచ్చేసరికి మారుతి రైటింగ్‌కు ఫిదా అయిపోయా. సినిమా అందరికీ నచ్చుతుంది. తప్పకుండా ఎంజాయ్ చేస్తారని ప్రభాస్ చెప్పుకొచ్చారు. ఫైనల్‌గా సంక్రాంతికి వచ్చే సినిమాలన్నీ హిట్‌ కావాలని ప్రభాస్ ఆకాంక్షించారు. ప్రభాస్‌ కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో రూపొందిన ఈ హారర్‌ థ్రిల్లర్‌‌లో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్‌, రిద్ది కుమార్‌ హీరోయిన్లుగా నటించారు. తమన్‌ సంగీతం అందించారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read More..

నేను ఆమెకు పెద్ద ఫ్యాన్ అయిపోయాను.. ప్రభాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Next Story