నిధి పాపని పెళ్లి చేసుకోవాలంటే ఎంత ఆస్తి ఉండాలి? ఫ్యాన్ ప్రశ్నచూసి ఆశ్చర్యపోయిన ప్రభాస్

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-12-28 04:49:50  IST  )

ప్రభాస్ హీరోగా.. డైరెక్టర్ మారుతీ తెరకెక్కించిన సినిమా ది రాజాసాబ్.

నిధి పాపని పెళ్లి చేసుకోవాలంటే ఎంత ఆస్తి ఉండాలి? ఫ్యాన్ ప్రశ్నచూసి ఆశ్చర్యపోయిన ప్రభాస్
X

దిశ, వెబ్‌డెస్క్:ప్రభాస్ హీరోగా.. డైరెక్టర్ మారుతీ తెరకెక్కించిన సినిమా ది రాజాసాబ్. ఈ సినిమా శనివారం సాయంత్రం హైదరాబాద్ లోని ఖైతలాపూర్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించింది. ఈ వేడుకలో హీరోయిన్ నిధి అగర్వాల్ అభిమాని ప్రదర్శించిన ప్లకార్డు వైరల్ అయింది. దానిని చూసిన యాంకర్ సుమ.. ప్లకార్డుపై ఉన్నది చదవగా.. హీరో ప్రభాస్ సహా అందరూ ఆశ్చర్యపోయారు. "నిధి పాపను పెళ్లి చేసుకోవాలంటే ఏ వృత్తిలో ఉండాలి ? ఎంత ఆస్తి ఉండాలి? ఎలా ఉండాలి?" అని దానిపై రాసి ఉంది.

ఈ విషయాన్నే సుమ నిధిని అడగ్గా.. ప్రొఫెషన్ ఆఫ్ లవ్ లో ఉండాలని బదులిచ్చింది. ఇక వేదికపై నిధి స్పీచ్ తర్వాత.. చీరలోనే అన్ని నిధులూ ఉన్నాయని సుమ అనడంతో.. ఫ్యాన్స్ విజిల్స్ తో ఆ ప్రాంగణం మార్మోగిపోయింది. పనిలో పనిగా ప్రభాస్ ను కూడా పెళ్లి చేసుకోవాలంటే ఉండాల్సిన క్వాలిటీ ఏంటని ప్రశ్నించగా.. అది తెలియకే ఇంకా పెళ్లి చేసుకోలేదని డార్లింగ్ చెప్పిన సమాధానంకు నవ్వులు పూశాయి. కాగా.. ఇటీవలే నిధి అగర్వాల్ రాజాసాబ్ సాంగ్ రిలీజ్ ఈవెంట్లో అభిమానులు చేసినపనికి చాలా ఇబ్బంది పడింది. ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవ్వగా.. హీరోయిన్ల డ్రస్ సెన్స్ పై శివాజీ చేసిన కామెంట్స్ పై పెద్ద దుమారమే రేగిన విషయం తెలిసిందే.

Read More..

‘సీనియర్స్ తర్వాతే మేము’.. రాజాసాబ్ ఫంక్షన్‌లో చిరంజీవిపై ప్రభాస్ కామెంట్స్

నేను ఆమెకు పెద్ద ఫ్యాన్ అయిపోయాను.. ప్రభాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Next Story