- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పెళ్లైన నాలుగేళ్లకు తండ్రి అయిన యంగ్ హీరో.. కొత్త అధ్యాయం మొదలైందంటూ ఎమోషనల్ పోస్ట్
నా జీవితంలోని అద్భుతమైన విషయాన్ని మీతో పంచుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది.

దిశ, సినిమా: కోలీవుడ్ యంగ్ హీరో హరీష్ కళ్యాణ్ (Harish Kalyan)తండ్రి అయ్యాడు. తన జీవితంలో అత్యంత మధురమైన ఘట్టాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ అధికారికంగా ప్రకటించారు. హరీష్ కళ్యాణ్ భార్య నర్మద ఉదయకుమార్ మార్చి 2న ఆడపిల్లకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని తెలుపుతూ హరీష్ ఒక ఎమోషనల్ నోట్ విడుదల చేశారు. ‘‘నా జీవితంలోని అద్భుతమైన విషయాన్ని మీతో పంచుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మా జీవితాల్లో కొత్త అధ్యాయం మొదలైంది. మార్చి 2వ తేదీన నర్మదకు, నాకు పాప పుట్టింది. ప్రస్తుతం తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు’’ అని రాసుకొచ్చారు.
తమ కుటుంబంపై చూపిస్తున్న ప్రేమాభిమానాలకు హరీష్ కృతజ్ఞతలు తెలిపారు. ‘‘కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు మాపై చూపిస్తున్న ఆదరణ మాకెంతో ఆనందంగా ఉంది. అందరికీ ధన్యవాదాలు.. ఓం నమశివాయ’’ అంటూ తన సంతోషాన్ని వ్యక్తపరిచారు. కాగా.. హరీష్ కళ్యాణ్-నర్మద 2022 అక్టోబర్‌లో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లయిన నాలుగేళ్లకు ఈ జంట తల్లిదండ్రులుగా తమ కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో తండ్రి అయ్యారనే వార్త తెలియగానే సోషల్ మీడియాలో అభిమానులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తమిళంలో 'ప్యార్ ప్రేమ కాదల్', 'ధరణి' వంటి చిత్రాలతో యూత్ ఐకాన్‌గా మారిన హరీష్, తెలుగులో నాని 'జెర్సీ' సినిమాలో కీలక పాత్రలో నటించి ఇక్కడి ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు.






