Rashmika: పిల్లల కోసం యుద్ధానికైనా సిద్ధమే.. మాతృత్వంపై రష్మిక ఎమోషనల్ కామెంట్స్

by Mallepaka Hamsa |   (  Updated:2026-03-03 10:36:44  IST  )

ఇంకా పుట్టని ఆ చిన్న ప్రాణాల మీద నాకు ఇప్పుడే చాలా స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంది.

Rashmika: పిల్లల కోసం యుద్ధానికైనా సిద్ధమే.. మాతృత్వంపై రష్మిక ఎమోషనల్ కామెంట్స్
X

దిశ, సినిమా: విజయ్ దేవరకొండ(Vijay Deverakonda), రష్మిక మందన్న(Rashmika Mandanna)ల పెళ్లి వార్త ఇంకా సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తూనే ఉంది. ఉదయ్‌పూర్‌లో పెళ్లి ముగించుకుని హైదరాబాద్ వచ్చిన ఈ కొత్త జంట, ప్రస్తుతం వరుసగా టెంపుల్స్ విజిట్ చేస్తూ, స్వీట్లు పంచుతూ సందడి చేస్తున్నారు. ముఖ్యంగా విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు ఇస్తామని ప్రకటించి అందరి ప్రశంసలు అందుకుంటున్న ఈ క్రమంలో, రష్మిక తన పిల్లల గురించి చేసిన ఎమోషనల్ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. రీసెంట్‌గా జరిగిన ఒక మూవీ ఈవెంట్‌లో రష్మిక తన ఫ్యూచర్ పిల్లల గురించి మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయ్యారు. ‘‘నేను ఇంకా తల్లిని కాలేదు, కానీ నాకు పిల్లలు పుడతారని నాకు తెలుసు. ఆ క్షణం కోసం నేను ఎంతో ఇష్టంగా ఎదురుచూస్తున్నాను.

ఇంకా పుట్టని ఆ చిన్న ప్రాణాల మీద నాకు ఇప్పుడే చాలా స్ట్రాంగ్ ఫీలింగ్ ఉంది. వాళ్ల కోసం నేను ఏదైనా చేయాలనుకుంటున్నాను. వాళ్లను చాలా సురక్షితంగా, ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలని నాకు ఉంది. ఒకవేళ వాళ్ల కోసం నేను యుద్ధానికి వెళ్లాల్సి వస్తే.. ఆ యుద్ధం చేసేంత ఫిట్‌గా నేను ఉండాలి. నేను ఇప్పుడే దాని గురించి ఆలోచిస్తున్నాను’’ అని రష్మిక చెప్పుకొచ్చారు. పెళ్లైన కొత్తలోనే రష్మిక ఇలా పిల్లల గురించి, వాళ్ల రక్షణ గురించి ఇంత ఇంటెన్సివ్‌గా మాట్లాడటం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. రష్మికలోని మాతృత్వాన్ని, బాధ్యతను చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఒకవైపు విందు భోజనాలు, మరోవైపు సామాజిక సేవ చేస్తూనే.. తన పర్సనల్ లైఫ్ గురించి ఇలా ఓపెన్‌గా మాట్లాడటం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. విజయ్ - రష్మికల ఈ కొత్త ప్రయాణం ఎంతో హ్యాపీగా సాగాలని అందరూ కోరుకుంటున్నారు.

తెల్లవారుజామున 4 గంటల వరకు నాన్-స్టాప్ పార్టీ.. ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ పోస్ట్

Next Story