తెల్లవారుజామున 4 గంటల వరకు నాన్-స్టాప్ పార్టీ.. ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ పోస్ట్

by Mallepaka Hamsa |   (  Updated:2026-03-03 06:30:45  IST  )

నేను తెల్లవారుజామున 4 గంటల వరకు ఆ డ్రెస్‌లోనే ఎంజాయ్ చేశాను.

తెల్లవారుజామున 4 గంటల వరకు నాన్-స్టాప్ పార్టీ.. ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ పోస్ట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ(Vijay Deverakonda), రష్మిక మందన్న (Rashmika Mandanna)ఎట్టకేలకు వైవాహిక బంధంతో ఒక్కటయ్యారు. గత కొన్నేళ్లుగా వీరిద్దరి ప్రేమాయణం గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వచ్చినప్పటికీ, ఎప్పుడూ అధికారికంగా స్పందించలేదు. అయితే, అన్ని ఊహాగానాలకు తెరదించుతూ ఈ క్రేజీ జంట ఫిబ్రవరి 26న అత్యంత ఘనంగా వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత ఈ నూతన దంపతులు విజయ్ దేవరకొండ సొంతూరైన నాగర్ కర్నూలు జిల్లా, బల్మూరు మండలం తుమ్మన్ వేట గ్రామానికి చేరుకున్నారు. అక్కడ కొత్తగా నిర్మించిన తమ నివాసంలో అత్యంత భక్తిశ్రద్ధలతో గృహప్రవేశం చేశారు. ఈ సందర్భంగా దంపతులిద్దరూ కలిసి సత్యనారాయణ స్వామి వ్రతం కూడా నిర్వహించుకున్నారు. గ్రామీణ వాతావరణంలో, కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఈ క్రమంలో.. తాజాగా విజయ్ దేవరకొండ తన సంగీత్ వేడుకకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ఒక ఎమోషనల్ నోట్ రాశారు. ‘‘మా సంగీత రాత్రి.. కన్నీళ్లు వచ్చేంత వరకు నవ్వుతూ, కాళ్లు నెప్పి పుట్టేంత వరకు డ్యాన్స్ చేస్తూ గడిపిన అద్భుతమైన సాయంత్రం. అందరి ప్రసంగాలకు భావోద్వేగాలను ఆపుకుంటూ, ఆశ్చర్యాలతో నిండిపోయిన క్షణాలు అవి. నాకెంతో ఇష్టమైన వ్యక్తులతో కూడిన ఒక పెద్ద సంతోషకరమైన పార్టీ ఇది. ప్రత్యేకంగా మా దుస్తులు అద్భుతంగా ఉన్నాయి, నేను తెల్లవారుజామున 4 గంటల వరకు ఆ డ్రెస్‌లోనే ఎంజాయ్ చేశాను’’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ సంగీత్ ఫోటోలు నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. విజయ్, రష్మికల కెమిస్ట్రీ చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. కాగా.. ఈ జంట తమ పెళ్లి వేడుకలను మరింత ఘనంగా ముగించేందుకు సిద్ధమైంది. మార్చి 4న హైదరాబాద్‌లో టాలీవుడ్ సెలబ్రిటీల కోసం ఒక భారీ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. ఈ పార్టీకి సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నారు.

పిల్లల కోసం యుద్ధానికైనా సిద్ధమే.. మాతృత్వంపై రష్మిక ఎమోషనల్ కామెంట్స్

Next Story