ఏందిరా ఈ పంచాయితీ.. నువ్వేమైనా Arjun Reddy సినిమాలో హీరో అనుకుంటున్నావా?

by Disha Web Desk 7 |
ఏందిరా ఈ పంచాయితీ.. నువ్వేమైనా Arjun Reddy సినిమాలో హీరో అనుకుంటున్నావా?
X

దిశ, సినిమా : విలేజ్ డ్రామా, లవ్ స్టోరీలను ఆడియన్స్ ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారు. ప్రేమ కథను కొత్తదనంతో అందంగా చూపిస్తూ ప్రస్తుతం యంగ్ మేకర్లు విజయాన్ని సాధిస్తున్నారు. ఈ కోవలోనే ‘ఏందిరా ఈ పంచాయితీ’ అనే సినిమా కూడా రాబోతోంది. ప్రభాత్ క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రదీప్ కుమార్.ఎం నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా గంగాధర.టి దర్శకుడిగా పరిచయం అవుతుండగా.. భరత్, విషికా లక్ష్మణ్‌లు ఈ చిత్రంతో హీరో హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తున్నారు. ఊరి వాతావరణం, గ్రామంలోని భిన్న మనస్తత్వాలున్న మనుషుల మధ్య సాగే ఈ మూవీగ్లింప్స్‌ను తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్.

‘మంచోడే అంటావా?’ అంటూ హీరోయిన్ ఓపెన్ అయిన గ్లింప్స్‌లో.. ‘ఎవరే.. ’అని హీరోయిన్ ఫ్రెండ్ డైలాగ్.. ‘అదే అభి..’ అంటూ హీరోయిన్ కాస్త హీరో ఇంట్రడక్షన్ గురించి చెప్పడం జరుగుతుంది. కాగా ‘యమున.. తొందరగా నా గురించి ఏమైనా ఆలోచించొచ్చు కదా?’ అని హీరో అనడంతో.. ‘నువ్వేమైనా అర్జున్ రెడ్డి సినిమాలో హీరో అనుకుంటున్నావా?’’ అనే హీరోయిన్ డైలాగ్.. ఇలా గ్లింప్స్ మొత్తం ఫ్రెష్ ఫీలింగ్‌తో ఉంది. ఇక పీఆర్ సంగీతం అందిస్తున్న సినిమాకు.. జేపీ ఎడిటర్‌గా వ్యవహరిస్తుండగా.. త్వరలోనే మూవీ రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు మేకర్స్.

ఇవి కూడా చదవండి: ‘కాంతారా 2’ షూట్‌పై లేటెస్ట్ అప్‌డేట్ ఇదే..

Next Story

Most Viewed