Guppedantha Manasu Today: రిషి మనసు మారుతుందా..? డీబీఎస్‌టీ కాలేజ్ కి వెళ్తాడా..?

by Phanindra |   (  Updated:2023-09-15 16:25:11  IST  )

గుప్పెడంత మనసు ఎపిసోడ్ లో ఈ సీను హైలెట్

Guppedantha Manasu Today: రిషి మనసు మారుతుందా..? డీబీఎస్‌టీ కాలేజ్ కి వెళ్తాడా..?
X

దిశ,వెబ్ డెస్క్: గుప్పెడంత మనసు ఎపిసోడ్ లో ఈ సీను హైలెట్

ఇక జగతి.. రిషి, వసు, మహేంద్రల దగ్గరకు వెళ్లి.. ‘మహేంద్ర మనం బాగానే ఇరుక్కుపోయాం.. ఆ ఎమ్ఎస్ఆర్ పెద్ద దెబ్బే కొట్టేశాడు’ అంటూనే.. ‘రిషి ఇంకా ఆలస్యం చేయకు. నువ్వు రావాల్సిన సమయం వచ్చేసింది. ప్లీజ్ .. డీబీఎస్‌టీ కాలేజ్‌కి వెళ్దాం అంటూ రిషిని బతిమిలాడుతుంది. దాంతో మహేంద్ర, వసులు కూడా గట్టిగా అడుగుతారు. ఒకసారి ‘డీబీఎస్‌టీ కాలేజ్ ఎండీగా ఆలోచించండి సార్..మనం ఎంత పెద్ద సమస్యలో ఉన్నామో తెలుస్తుంది.. ఇంకేం ఆలోచించకుండా ప్లీజ్.. వెళ్దాం రండి’ అని అంటుంది వసు కూడా. అయితే మన సార్ కి ఇగో కొంచం ఎక్కువే కదా.. వాళ్లు చెప్పింది ఏమి వినడు. నేను ఏదీ మరిచిపోను అంటాడు. దాంతో వసు కోపంగా.. ‘నేను వెళ్తాను.. నేను చూస్తూ మీలా ఊరుకోలేను.. సమస్య వచ్చింది మన కాలేజ్‌కే అందుకే నేను వెళ్తాను’ అంటూ జగతి వాళ్లతో పాటు వసు డీబీఎస్‌టీ కాలేజ్‌కి బయలుదేరుతుంది.

More News: Brahmamudi Episode: తల్లి మీద తిరగబడిన రాజ్.. కావ్య ప్రేమ కోసమేనా ఈ మార్పు?

Next Story