Agent: నుండి వైల్డ్ సాల సాంగ్ రిలీజ్.. అఖిల్ ఊరమాస్ స్టెప్స్

by Disha Web Desk 6 |
Agent: నుండి వైల్డ్ సాల సాంగ్ రిలీజ్.. అఖిల్ ఊరమాస్ స్టెప్స్
X

దిశ, వెబ్ డెస్క్: అక్కినేని అఖిల్, సాక్షి వైద్య జంటగా నటిస్తున్న చిత్రం ‘ఏజెంట్’. ఈ మూవీని స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి రూపొందిస్తున్నాడు. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే ‘ఏజెంట్’ నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్, ట్రైలర్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేశాయి. ఇక ఈ చిత్రంలో స్పెషల్ సాంగ్‌లో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా నటిస్తోంది. తాజాగా, ఏజెంట్ లోంచి ‘వైల్డ్ సాలా’ అంటూ సాగే ఐటెం సాంగ్‌ను చిత్రయూనిట్ రిలీజ్ చేసింది. ఇందులో అఖిల్, ఊర్వశి డాన్స్‌తో దుమ్ములేపేశారు. దీంతో అది చూసిన నెటిజన్లు ‘సినిమా హిట్ కొట్టడం ఖాయమని’ కామెంట్లు చేస్తున్నారు. ఈ పాటకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. ‘ఏజెంట్’ ఏప్రిల్ 28న విడుదల కాబోతుంది.

Also Read: ఏజెంట్ సినిమాకి అఖిల్ రెమ్యునరేషన్ తీసుకోవడం లేదా? నిర్మాత ఏం చెప్పారంటే?




Next Story