- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేనెలా ఉండాలో చెప్పడానికి మీరెవరు.. ట్రోలర్స్‌కు అల్లు శిరీష్ స్ట్రాంగ్ కౌంటర్
మగవారు నగలు ధరించకూడదనేది కేవలం పాశ్చాత్య సంస్కృతి ప్రభావమే.

దిశ, సినిమా: మెగా హీరో అల్లు శిరీష్ వివాహం ఇటీవల నాయనిక రెడ్డితో అట్టహాసంగా జరిగింది. అయితే, తన పెళ్లి వేడుకల్లో శిరీష్ ధరించిన ఖరీదైన నగలు, ముఖ్యంగా మెడలో ధరించిన 'చోకర్' (Choker) సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. దీనిపై వచ్చిన మీమ్స్, ట్రోల్స్ గురించి శిరీష్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో స్పందిస్తూ, లింగ వివక్షలు గురించి గట్టిగా మాట్లాడారు. తన మెడలోని చోకర్‌పై మీమ్స్ వైరల్ అవ్వడంతో శిరీష్ స్పందిస్తూ.. "మగవారు నగలు ధరించకూడదనేది కేవలం పాశ్చాత్య సంస్కృతి ప్రభావమే. మన దేశ చరిత్రను ఒకసారి చూస్తే, పూర్వం భారతీయ మహారాజులు, మొఘల్ చక్రవర్తులు భారీ హారాలు, చోకర్లు ధరించేవారు.
2026లో ఉన్నాం, ఇంకా పాతకాలం నాటి పరిమితుల్లో బతకడం అవసరమా?" అని ప్రశ్నించారు. ఈ మార్పు మన దగ్గరే మొదలవ్వాలని, అందుకే ధైర్యంగా ఈ స్టైల్‌ను ఎంచుకున్నానని ఆయన చెప్పుకొచ్చారు. "నేను ఏది వేసుకోవాలో, నా మేనరిజం ఎలా ఉండాలో ఇతరులు చెబితే వినాల్సిన అవసరం లేదు. నా స్టైల్ ఏంటో నాకు తెలుసు. నాకు నచ్చినట్టు నేనుంటాను. ఎలా ఉండాలో చెప్పడానికి మీరెవరు" అంటూ శిరీష్ కుండబద్దలు కొట్టారు. పెళ్లికి 'వడ్డాణం' కూడా పెట్టుకుంటావా అని వెక్కిరించిన వారికి, హిస్టరీ ఫోటోలను షేర్ చేస్తూ గట్టి క్లాస్ పీకారు. మార్చి 6న జరిగిన తన వివాహంలో కేవలం డ్రెస్సింగ్ మాత్రమే కాకుండా, చేతిపై భార్య పేరుతో పాటు 'బాలాజీ నామం-శంఖు-చక్రం' మెహందీ పెట్టుకుని తన సంస్కృతిని, భక్తిని చాటుకున్నారు.






