- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మల్టీప్లెక్సుల కంటే ఎక్కువ ఫీల్ ఇవ్వాలనేదే మా టార్గెట్: అల్లు అరవింద్
అల్లు సినిమాస్ ప్రారంభోత్సవ సందర్భంగా.. అల్లు అరవింద్ మాట్లాడుతూ .. ‘రెండేళ్లు కష్టపడి ‘అల్లు సినిమాస్’ను నిర్మించాం. ‘అల్లు సినిమాస్’ను నిర్మించడానికి మూడు కారణాలున్నాయి.

దిశ, సినిమా: ప్రపంచ స్థాయి సాంకేతికతతో కూడిన ప్రీమియం లార్జ్ స్క్రీన్ ఫార్మాట్‌ను ‘అల్లు సినిమాస్’ హైదరాబాద్‌కు పరిచయం చేస్తోంది. హైదరాబాద్‌కు ఇదొక చారిత్రాత్మక ఘట్టంగా నిలుస్తుంది. నగరంలో తొలి డాల్బీ సినిమా వచ్చింది. హైదరాబాద్‌లోని కోకాపేటలోని 7 ఎకరాల అల్లు స్టూడియోస్ కాంప్లెక్స్‌లో ఉన్న నాలుగు స్క్రీన్‌ల అల్ట్రా-లగ్జరీ మల్టీప్లెక్స్ అల్లు సినిమాస్‌ను ప్రారంభించినట్లు అల్లు ఎంటర్‌టైన్‌మెంట్ గర్వంగా ప్రకటించింది. ఇకపై ల్యాండ్‌మార్క్ వినోద గమ్యస్థానంగా అల్లు సినిమాస్ మారనుంది. హైదరాబాద్‌ను అల్లు సినిమాస్ వరల్డ్ మూవీ మ్యాప్‌లో సరికొత్త స్థాయిలోని నిలబెడుతుంది. హైదరాబాద్‌లో మొట్టమొదటి డాల్బీ చిత్రం, ప్రపంచంలోనే అతిపెద్ద డాల్బీ స్క్రీన్‌లలో ఒకటిగా ‘అల్లు సినిమాస్’ రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ మైలురాయి ప్రపంచవ్యాప్తంగా ఎంటర్టైన్మెంట్ రంగంలో కొత్త బెంచ్‌మార్క్‌ను నిర్దేశిస్తుంది. ప్రేక్షకులకు ఈ ‘అల్లు సినిమాస్’ అత్యాధునిక సాంకేతికత, లగ్జరీ, సౌకర్యవంతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందిస్తుంది. ‘అల్లు సినిమాస్’ ఇచ్చే ఎక్స్‌పీరియెన్స్ గురించి అల్లు అరవింద్ మీడియాతో ముచ్చటించారు.
అల్లు సినిమాస్ ప్రారంభోత్సవ సందర్భంగా.. అల్లు అరవింద్ మాట్లాడుతూ .. ‘రెండేళ్లు కష్టపడి ‘అల్లు సినిమాస్’ను నిర్మించాం. ‘అల్లు సినిమాస్’ను నిర్మించడానికి మూడు కారణాలున్నాయి. యూవీ వంశీ సూళ్లూరుపేటలో లగ్జరీ థియేటర్‌ను కట్టారు. ఆ థియేటర్లో సినిమాని చూడటానికి పక్క ఊర్ల నుంచి కూడా జనాలు వస్తున్నారు. అది చూసి నాకు కూడా ఓ లగ్జరీ థియేటర్ కట్టాలని అనిపించింది. మిషన్ ఇంపాజిబుల్ 6 కోసం ఓ పెద్ద పారిశ్రామికవేత్త ఐమ్యాక్స్ లార్జ్ స్క్రీన్‌లో టికెట్లు కావాలని, పిల్లలు గోల చేస్తున్నారని, కచ్చితంగా టికెట్లు కావాలని అడిగారు. ఆ టికెట్లు నేను ఆయనకు ఇవ్వడంతో చాలా సంతోషించారు. అంటే పిల్లలు కేవలం సినిమాని చూడకుండా, దాన్ని ఎక్స్‌పీరియెన్స్ చేయాలని అనుకుంటున్నారు. ఆ ఎక్స్‌పీరియెన్స్ కోసం ఎంతైనా ఖర్చు పెట్టేందుకు ప్రేక్షకులు రెడీగా ఉన్నారు. అప్పుడు నాకు కొన్ని ఐడియాలు వచ్చాయి. లార్జ్ ఫార్మాట్, కొత్త ఎక్స్‌పీరియెన్స్ కోసం ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారు. అలా మా ‘అల్లు సినిమాస్’ మొదలైంది. సింగిల్ స్క్రీన్లలో వస్తున్న ఎక్స్‌పీరియెన్స్ ఇప్పుడు జనాలకు సరిపోవడం లేదు.
అందుకే ఎక్కువగా మల్టీ ప్లెక్స్‌లకు వస్తున్నారు. సినిమా కంటే.. సినిమాని ఎక్స్‌పీరియెన్స్ చేసేందుకు జనాలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. మల్టీప్లెక్సుల కంటే ఎక్కువ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వాలని ‘అల్లు సినిమాస్’ను నిర్మించాం. డాల్బీలో సినిమా చాలా కొత్తగా కనిపిస్తుంది, వినిపిస్తుంది. డాల్బీలోకి మారిన సినిమా విజువల్ పరంగా, సౌండ్ పరంగా అద్భుతంగా ఉంటుంది. 2024లో మేం డాల్బీని సంప్రాదించాం. డాల్బీ సినిమాస్ ఇండియా ప్రతినిథి రాజ్ మాకు ఎంతో సహకరించారు. అమెరికా, జర్మనీ, ఇండియన్ టీం ఇలా అందరం కలిసి ఓ డెబ్బై సార్లు జూమ్ కాల్స్‌లో కలిసి ఉంటాం. ఈ స్క్రీన్‌లో 78 స్పీకర్లు, 165 సౌండ్ ఔట్ లెట్లను బయటకు కనిపించకుండా అమర్చారు. జర్మనీ టీం ఈ స్క్రీన్‌ను చూసి ఆశ్చర్యపోయారు. ‘అల్లు సినిమాస్’ ఇచ్చే ఎక్స్‌పీరియెన్స్ గురించి మీడియానే జనాల్లోకి తీసుకెళ్లాలి’’అని అన్నారు.






