‘ఉస్తాద్ భగత్ సింగ్’కు గుడ్‌న్యూస్.. టికెట్ల రేట్ల పెంపునకు సర్కార్ గ్రీన్ సిగ్నల్

by Gantepaka Srikanth |   (  Updated:2026-03-13 13:45:32  IST  )

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రబృందానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.

‘ఉస్తాద్ భగత్ సింగ్’కు గుడ్‌న్యూస్.. టికెట్ల రేట్ల పెంపునకు సర్కార్ గ్రీన్ సిగ్నల్
X

దిశ, వెబ్‌డెస్క్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రబృందానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఏపీలో టికెట్ల రేట్లు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు శుక్రవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. సినిమా విడుదలైన నాటి నుంచి పది రోజుల వరకు టికెట్ల రేట్లు పెంచుకునే వెసులుబాటు కల్పించింది. సింగిల్ స్క్రీన్లలో రూ.100, మల్టీప్లెక్సులలో రూ.125 పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈనెల 18న ప్రీమియర్ షోకు సైతం ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రీమియర్ షో టికెట్ ధర రూ.500లుగా నిర్ణయించింది.

గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ కల్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో పవన్ కల్యాణ్ సరసన శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్లుగా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్మించింది. పవన్ కల్యాణ్‌ను ఇంతకుముందెన్నడూ చూడని అత్యుత్తమ ఫార్మాట్‌లో, డాల్బీ స్క్రీన్స్‌పై చూడటం అభిమానులకు గొప్ప థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుందని మేకర్స్ తెలిపారు.

TG: సినిమా టికెట్ రేట్ల పెంపు ఇష్యూ.. ‘ఉస్తాద్ భగత్ సింగ్‌’కు గుడ్‌న్యూస్

Next Story